Duvvada Srinivas : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణను ముల్లంగించినట్లు వచ్చిన ఫిర్యాదుతో జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ పార్టీ అధికారిక ట్విట్టర్లో ఒక పోస్టు షేర్ చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు రావడం.. పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా సిఫారసు చేయడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. ఒక ప్రకటనలో తెలిపింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే దువ్వాడ కుటుంబ వివాదంతోనే ఆయనను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో పార్టీ చాలా జాతీయం చేసిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read : ‘తెర’పై దువ్వాడ బయోపిక్.. అదిరిపోయే ట్విస్టులతో!
* చాలా రోజులుగా రచ్చ..
గత కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ దువ్వాడ( MLC duvvada Srinivas ) కుటుంబ వివాదం పెను దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే. భార్య, పిల్లలతో విభేదించి దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురితో ఉంటున్న సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ నూతన ఇంటి కోసం భార్య వాణి నిరసన దీక్షకు దిగారు. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ ఆమెతోపాటు పిల్లలపై దుర్భాషలాడుతూ దాడికి దిగే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇటు తరుణంలో కొద్దిరోజుల పాటు ఆ ఎపిసోడ్ నడిచింది. చివరకు ఆ ఇంటిని దివ్వెల మాధురి పేరుతో రాయడంతో వివాదం ముగిసింది. అయితే సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్, దువ్వెల మాధురి జంట హల్చల్ చేస్తోంది. నూతన వ్యాపారంలో అడుగుపెట్టడమే కాకుండా మీడియాలో ఆ జంట నిత్యం సందడి చేస్తూనే ఉంది. తరుణంలో దువ్వాడ శ్రీనివాస్ తీరుతో పార్టీకి నష్టం జరుగుతుందని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో ఆలస్యంగా నైనా వైసిపి హై కమాండ్ చర్యలకు దిగడం విశేషం.
* ఎన్నికలకు ముందే వివాదం..
2024 ఎన్నికలకు ముందు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం వెలుగులోకి వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ కు టెక్కలి అసెంబ్లీ టికెట్ ఇవ్వడాన్ని ఆయన భార్య వాణి( duvvada Vani ) వ్యతిరేకించారు. తనకు టికెట్ కేటాయించాలని కోరారు. అయితే జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ వైపు మొగ్గు చూపారు. దువ్వాడ వాణికి వైసీపీ పెద్దలు నచ్చ చెప్పారు. అయితే ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ దారుణంగా ఓడిపోయారు. అప్పటినుంచి కుటుంబ వివాదం మరింత ముదిరింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణిని కాదని.. దివ్వెల మాధురితో( divvela Madhuri ) సహజీవనం చేస్తున్నారు. ప్రస్తుతం వారి కుటుంబ వివాదం న్యాయస్థానం పరిధిలో ఉంది. అయితే దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట నిత్యం హల్చల్ చేస్తూనే ఉంది. అయితే ఈ వ్యవహారం రాజకీయ ప్రత్యర్థులకు ప్రచార అస్త్రంగా మారింది.
* ఇన్నాళ్లకు చర్యలా?
అయితే దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఇన్నాళ్లు ఉపేక్షించిన హైకమాండ్.. ఇప్పుడు ఉన్నఫలంగా చర్యలకు దిగడం మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. కుటుంబ వివాదం తెరపైకి వచ్చిన క్రమంలో ఎన్నడు దానిపై వైసీపీ పెద్దలు నోరు తెరవలేదు. కనీసం దువ్వాడ శ్రీనివాస్ ను మందలించలేదు. అటు దువ్వాడ శ్రీనివాస్ సైతం జగన్మోహన్ రెడ్డి పై వీర విధేయత చూపుతూ వచ్చారు. కూటమి ప్రభుత్వానికి సవాల్ చేస్తూ వచ్చారు. తనను కేసుల్లో ఇరికించినా పర్వాలేదని.. అరెస్టు చేసినా డోంట్ కేర్ అంటూ ప్రకటించారు. అయితే ఇంతలోనే హై కమాండ్ సస్పెన్షన్ వేటు వేయడం విశేషం.
Also Read : లైవ్ లో బోరున ఏడ్చిన దువ్వాడ.. ఊకో అంటూ ఓదార్చిన మాధురి.. వైరల్ వీడియో!