
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులు పురుషోత్తం, పద్మజ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మదనపల్లె సబ్-జైలులో ఉన్న పద్మజ.. తన ప్రవర్తనతో తోటి మహిళా ఖైదీల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. నిన్న రాత్రి జరిగిన ఘటనతో మహిళా ఖైదీలంతా మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పద్మజ ఉంటున్న బ్యారక్‌లో మహిళలు రాత్రుల్లో నిద్రించాలంటే భయపడుతున్నారన్నారు. పద్మజ దెబ్బకు ఆందోళనకు గురైన సహచర ఖైదీలు ఆమెను ప్రత్యేక గదికి తరలించాలని మొర పెట్టుకున్నారట.
Also Read: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి
పురుషోత్తంనాయుడు కూడా ఒంటరిగా కూర్చొని నమస్కారాలు చేసుకుంటున్నారట. ఒక్కోసారి ఏడుస్తున్నారని తెలిపారు. పద్మజ, పురుషోత్తంలను మెరుగైన చికిత్స కోసం దంపతులను విశాఖకు తరలించాలని తిరుపతి వైద్యులు సూచించినప్పటికీ.. బందోబస్తుకు ఏఆర్ సిబ్బంది సహకరించడంలేదన్నారు. ఈ విషయమై జైళ్లశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని.. అధికారులు వెంటనే స్పందించి వారిని విశాఖకు తరలించేందుకు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
Also Read: జంట హత్యలకు క్షుద్రపూజలు కారణం కాదట : లాయర్ సంచలన వ్యాఖ్యలు
పురుషోత్తమ నాయుడు, పద్మజ దంపతులను గతనెల 24న తమ కన్నబిడ్డలైన అలేఖ్య, సాయిదివ్యను హత్య చేశారు. ఈ కేసులో వారిని జైలుకు తరలించారు. రెండు రోజులకే పద్మజ అరుపులు, కేకలతో ఖైదీలు భయపడిపోయారు. తర్వాత రుయాకు తరలించగా.. మానసిక వైద్యనిపుణులు వారిని చికిత్స నిమిత్తం విశాఖ ఆస్పత్రికి తరలించాలని రిఫర్ చేశారు. ఈ సూచనతో పద్మజను ప్రత్యేక గదిలో ఉంచిన జైలు అధికారులు ఓ మహిళా కానిస్టేబుల్‌ను బందోబస్తుగా ఉంచారు. ఆమె కాస్త కుదుటపడటంతో మహిళా బ్యారక్‌కు పంపారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
తన విచిత్ర ప్రవర్తనతో తోటి ఖైదీలకు విశ్రాంతి లేకుండా చేస్తోందట పద్మజ. శివ..శివ అంటూ గట్టిగా అరవడంతో పాటు కలియుగం అంతమైపోతోందని, ప్రస్తుతం దేవుడికి–రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతోందంటూ తోటి ఖైదీలతో ఆమె పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోందట. దీంతో మిగతా మహిళా ఖైదీలు నిద్రలేని రాత్రిళ్లు గడుపుతున్నారు. రాత్రి నుంచి పద్మజ మానసిక స్థితి మళ్లీ అదుపుతప్పినట్టు భావిస్తున్నారు. రుయా ఆస్పత్రి సిఫార్సు మేరకు ఆమెను విశాఖకు తరలించాలని భావిస్తున్నారు పోలీసులు.