Pawankalyan : ముల్లును ముల్లతోనే తియ్యడానికి జనసేనాని పవన్ డిసైడయినట్టున్నారు. అందుకే తెలుగు హీరోల అభిమానులందరికీ ఏకతాటిపైకి తెస్తున్నారు. వారి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నిస్తున్నారు. మీకు ఇష్టమైన హీరోను అభిమానించండి.. కానీ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన పార్టీకి మాత్రమే మద్దతు పలకండి అంటూ పవన్ చేసిన ప్రకటన వర్కవుట్ అయినట్టుంది. అందుకే అందరూ ఏకపక్షంగా మద్దతు తెలుపుతున్నారు. గోదావరి జిల్లాల్లో ముగిసిన వారాహి తొలి విడత ముగింపు బహిరంగ సభకు పెద్దఎత్తున హాజరయ్యారు. మా హీరోను అభిమానిస్తూనే పవన్ కు మద్దతు తెలుపుతామని బాహటంగా చెబుతున్నారు.
వారాహి యాత్ర ప్రారంభం నుంచే పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒక వైపు రాజకీయ ప్రసంగాలు చేస్తూనే… సినిమా రంగం గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. తనకు మహేష్ బాబు, ప్రభాష్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి ఇష్టమైన నటులని పేర్కొన్నారు. ప్రభాష్ పాన్ ఇండియా స్టార్ అయితే..తారక్, రాంచరణ్ గ్లోబల్ స్టార్లుగా చెప్పుకొచ్చారు. వారంతా తన కంటే మంచి నటులని గుర్తుచేసుకున్నారు. దీంతో వారి అభిమానుల వద్ద సాఫ్ట్ కార్నర్ లభించేలా పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సినీ రంగాన్ని అభిమానిస్తూ తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు.
అందరి హీరోల గొప్పతనం చెప్పడం ద్వారా వారి ఫ్యాన్స్ అభిమానం చూరగొనడంలో పవన్ కొంతవరకూ సఫలీకృతులయ్యారు. ప్రభాష్ సొంత నియోజకవర్గం నరసాపురంలో పవన్ ప్రసంగం సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మీరెవర్నీ అభిమానించినా రాష్ట్ర హితం కోసం జనసేనకు సపోర్టు చేయాలన్న పిలుపు ఫ్యాన్స్ గుండె లోతులకు తాకింది. నేరుగా ప్రభాష్ అభిమానులకు పవన్ పిలుపునివ్వడం ఆకర్షించింది. అంతుకు ముందు యాత్రలో తారక్ గురించి ప్రత్యకంగా అభిమానిస్తూ ఫ్యాన్స్ కు దగ్గరయ్యారు. అయితే భీమవరంలో ముగింపు సభకు పెద్దఎత్తున ప్రభాష్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ రావడం విశేషం. తమ అభిమాన హీరోల విషయంలో పవన్ వ్యవహరించిన తీరు తమకు ఎంతగానో ఆకట్టుకుందని.. అందుకే రాజకీయంగా పవన్ కు సపోర్టుగా నిలవాలని నిర్ణయించుకున్నట్టు వారు బాహటంగా చెప్పడం విశేషం.