Director Shankar : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వరుస విజయాలను అందుకుంటూ ఓటమి అనేదే ఎరగకుండా రెండు దశాబ్దాల పాటు తమిళ్ ఇండస్ట్రీని శాసించిన ఏకైక దర్శకుడు శంకర్…ఆయనకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ అయితే ఉంది. అందువల్ల ఆయన సినిమాలు ఎప్పుడు తెలుగులో డబ్ అవుతూ మంచి విజయాలను సాధిస్తూ ఉంటాయి. ఇక ఇదిలా ఉంటే ఈయన గేమ్ చేంజర్, ఇండియన్ 2 అనే రెండు పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే దానిమీద క్లారిటీ లేదు. కానీ ఈ రెండు సినిమాలను ఒకే టైంలో చేస్తూ శంకర్ చాలా బిజీగా ఉన్నాడు. ఇక రీసెంట్ గా తన కూతురు పెళ్లి జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ పెళ్లి కి చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక అందులో భాగంగానే బాలివుడ్ హీరో రన్వీర్ సింగ్ కూడా రిస్పెషన్ కి రావడమే కాకుండా ఆయన అందర్నీ ఆశ్చర్యపరుస్తూ స్టేజ్ మీద స్టెప్ లు వేయడం అనేది నిజంగా మంచి విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే రన్వీర్ సింగ్ చాలా రోజుల నుంచి శంకర్ ని ఫాలో అవుతూ వస్తున్నాడు.
నిజానికి శంకర్ గేమ్ చేజర్ ఇండియన్ 2 సినిమాల కంటే ముందే రన్వీర్ సింగ్ తో అపరిచితుడు సినిమాని రీమేక్ చేయాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. మరి ఇప్పుడు కూడా ఆయన శంకర్ తోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు అలాగే శంకర్ ని ఇంప్రెస్ చేయడానికి ఏదైనా సరే చేయడానికి తను రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పుడు శంకర్ ఈ సినిమాల తర్వాత రన్వీర్ సింగ్ తో అపరిచితుడు రీమేక్ చేసే ఆలోచనలో శంకర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ తను ఆ సినిమాని రీమేక్ చేసినట్లయితే బాలీవుడ్ లో ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తుందనడం లో ఎంత మాత్రం శయోక్తి లేదు…