https://oktelugu.com/

Raja Reddy Marriage: షర్మిల కొడుకు పెళ్లి ఏ సాంప్రదాయంలో జరిగిందో తెలుసా.. వైరల్ అవుతున్న ఫోటోలు

రాజస్థాన్‌లోని జో«ద్‌పూర్‌లో రాజారెడ్డి–ప్రియల వివాహం జరుగగా, హైదరాబాద్‌లో వీరి రిసెస్షన్‌ జరుగనుంది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీల నేతలు హాజరవుతారని తెలుస్తోంది. ఈమేరకు షర్మిల చాలా మందినే పెళ్లి, రిసెప్షన్‌కు ఆహ్వానించారు.

Written By: , Updated On : February 20, 2024 / 08:29 AM IST
Raja Reddy Marriage

Raja Reddy Marriage

Follow us on

Raja Reddy Marriage: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి తనయ, ఏపీ ప్రస్తుత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెల్లి, ఆంధ్రపదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల తనయుడు వైఎస్‌.రాజారెడ్డి వివాహం జో«ద్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రియురాలు అయిన అట్లూరి ప్రియను రాజారెడ్డి వివాహమాడారు. వేడుకలకు కుటుంబ సభ్యులతోపాటు ప్రత్యేక అతిథులను మాత్రమే ఆహ్వానించారు. పెళ్లికి వచ్చిన కుటుంబ సభ్యులు, అతిథులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఈ పెళ్లి వేడుక హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిందని కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఉదయం హిందూ పద్ధతిలో, రాత్రి క్రిస్టియన్‌ పద్ధతిలో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.

షర్మిట ట్వీట్‌..
సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలను వైఎస్‌.షర్మిలనే ఎక్స్‌లో పోస్టు చేశారు.
‘ఓ తల్లిగా నా జీవితంలో ఇది మరొక సంతోషకరమైన ఘట్టం. వేచి చూసిన క్షణాలు ఎట్టకేలకు వచ్చాయి. సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడి అంతులేని ప్రేమ, కృప, సన్నిహితుల దీవెనలు, శుభాకాంక్షలతో ఈ శుభకార్యం ఘనంగా జరిగింది. నా బిడ్డ తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లాడాడు. కొన్ని అద్భుతమైన క్షణాలు ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయి’ అంటూ షర్మిల ట్వీట్‌ చేశారు. ఇక ఇందులో కొన్ని హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకున్న ఫొటోలు, మరికొన్ని క్రిస్టియన్‌ పద్ధతిలో పెళ్లి జరిపించిన ఫొటోలు ఉన్నాయి. ఈ ఫొటోల ఆధారంగా రెండు పద్ధతుల్లో రాజారెడ్డి–ప్రియ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రెడిషన్‌ ఇటీవల కామన్‌ అయింది. ఇక పెళ్లి ఫొటోలను చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు. రెండు పద్దతుల్లో వివాహం జరిపించడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా కూడా కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కొందరేమో కులం, మతం అని చూడకుండా ఎన్నికల కోసమే షర్మిల ఇలా రెండు పద్ధతుల్లో వివాహం జరిపించారని పేర్కొంటున్నారు. ముఖ్యంగా హిందూ పద్ధతిలో పెళ్లి జరిపించడంపై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. హిందు వివాహానికి ఉన్న పవర్‌ అలాంటిది అని పేర్కొంటున్నారు.

హైదరాబాద్‌లో రిసెప్షన్‌..
ఇక రాజస్థాన్‌లోని జో«ద్‌పూర్‌లో రాజారెడ్డి–ప్రియల వివాహం జరుగగా, హైదరాబాద్‌లో వీరి రిసెస్షన్‌ జరుగనుంది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీల నేతలు హాజరవుతారని తెలుస్తోంది. ఈమేరకు షర్మిల చాలా మందినే పెళ్లి, రిసెప్షన్‌కు ఆహ్వానించారు. ఇదిలా ఉంటే.. రాజారెడ్డి మేనమామ అయిన ఏపీ సీఎం జగన్, ఆయన సతీమణి భారతి పెళ్లికి వెళ్లకపోవడం గమనార్హం. షర్మిల తల్లి విజయమ్మ మాత్రమే వివాహానికి హాజరయ్యారు.