Apple iphone: సాంకేతిక ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ లు ప్రపంచాన్ని కళ్ళ ముందు ఉంచుతున్నాయి. ఇలాంటి స్మార్ట్ ఫోన్ లలో ఆపిల్ ఐ ఫోన్ కు ఉండే క్రేజ్ వేరు. ప్రతి సంవత్సరం ఈ కంపెనీ కొత్త మోడల్ ఆవిష్కరిస్తుంది. ఈ కొత్త నమూనా ఫోన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఎదురు చూస్తుంటారు. ముందుగానే బుక్ చేసుకుంటారు. ధర ఎంతైనా చెల్లిస్తారు. బ్యాటరీ, కెమెరా సామర్థ్యం, ఫోటోల్లో నాణ్యత, అధునాతన యాంటీ వైరస్, ఇంకా చాలా ఫీచర్లు ఆపిల్ సొంతం. ధర విషయంలో ఏమాత్రం రాజీపడని ఆపిల్ సంస్థ తన వినియోగదారుల కోసం.. ఓ మోడల్ పై ధర తగ్గించింది.. ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో పెట్టింది. దీనిని ఎలా సొంతం చేసుకోవాలంటే.. ఇంతకీ ఈ మోడల్ ధర, దీని ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఫ్లిప్ కార్ట్ ఆపిల్ ఐ ఫోన్ – 13 మోడల్ పై భారీ తగ్గింపును ప్రకటించింది.ఈ నమూనాలో 128 జీబీ సామర్థ్యం ఉన్న ఫోన్ ను 59,900 కు విక్రయిస్తుండగా.. దానిపై 11% తగ్గింపును ప్రకటించింది. 11 శాతం తగ్గింపు తర్వాత వినియోగదారులకు అది 52,999 కే లభిస్తుంది. దీనిపై ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా ప్రకటించింది. ఐ ఫోన్ – 13 పై ఫ్లిప్ కార్ట్ 42,000 ఎక్స్ చేంజ్ ఆఫర్ ప్రకటిస్తోంది. ఒకవేళ ఆ ఆఫర్ పొందితే దానిని కేవలం 11 వేలకే సొంతం చేసుకోవచ్చు.
ఐ ఫోన్ – 13 ను ఆపిల్ 2021లో లాంచ్ చేసింది. ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటీనా డిస్ ప్లే ఉంది. A15 బయోనిక్ దీనికి ప్రధాన ఆకర్షణ. వినియోగదారుల కోసం 4GB RAM, 512 GB మెమరీ సామర్థ్యంతో ఆపిల్ ఈ ఫోన్ ను రూపొందించింది. ఈ ఫోన్ లో 12mp, 12 mp సామర్థ్యంతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీ కోసం 12mp కెమెరా ఉంది. వీటితో నాణ్యమైన చిత్రాలు తీయవచ్చు. వీడియోలు కూడా అద్భుతంగా రూపొందించవచ్చు. అనేక రకాల వేరియంట్లలో ఆపిల్ ఈ ఫోన్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.