https://oktelugu.com/

Rajamouli: రాజమౌళి చేతిలో దెబ్బలు తిన్న నటుడు ఎవరో తెలుసా..?

రాజమౌళికి నటుడు ఛత్రపతి శేఖర్ కి మధ్య మొదటి నుంచి కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది. రాజమౌళి డైరెక్షన్ ట్రైల్స్ లో ఉన్నప్పటి నుంచే శేఖర్ తనకు పరిచయమట. ఇక అప్పటినుంచి శేఖర్ కి తన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక క్యారెక్టర్ అయితే ఇస్తు తనను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు.

Written By:
  • Dharma
  • , Updated On : June 21, 2024 / 08:39 AM IST

    Rajamouli

    Follow us on

    Rajamouli: దర్శక ధీరుడు జక్కన్న ఏ సినిమా చేసిన కూడా అది ఒక సంచలనంగా మిగిలిపోతుంది. ఇక ఆయన ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కూడా కొనసాగుతున్నాడు. కాబట్టి తనతో సినిమాలు చేయడానికి ప్రతి ఒక్క హీరో కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. కానీ రాజమౌళి మాత్రం తెలుగు హీరోల పైన ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ మన వాళ్ళతోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. బాలీవుడ్ హీరోలు రాజమౌళితో ఒక సినిమా చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన మాత్రం తనకున్న కమిట్ మెంట్స్ మొత్తం పూర్తయిన తర్వాత ఆలోచిస్తాను అని చెప్పడం విశేషం…

    నిజానికి ఆయన చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక 100 కి 100% స్ట్రైక్ రేట్ ని కలిగి ఉన్న దర్శకుడి గా కూడా తనకు ఒక మంచి గుర్తింపు అయితే ఉంది. మరి ఆయన ఎప్పుడైతే బాహుబలి సినిమా చేశాడో అప్పటినుంచి పాన్ ఇండియా డైరెక్టర్ గానే కాకుండా ఇండియా లోనే తనను మించిన దర్శకుడు మరొకరు లేరు అనేలా గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ఎవరి మీదకి కోపానికి అయితే రాడు. కానీ అప్పట్లో షూటింగ్ చేసేటప్పుడు ఒక నటుడిని కొట్టాడు అనే వార్తలైతే వచ్చాయి. అయితే ఆయన నిజంగా కొట్టాడా లేదంటే షూటింగ్ లో భాగంగా అలా జరిగిందా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…

    రాజమౌళికి నటుడు ఛత్రపతి శేఖర్ కి మధ్య మొదటి నుంచి కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది. రాజమౌళి డైరెక్షన్ ట్రైల్స్ లో ఉన్నప్పటి నుంచే శేఖర్ తనకు పరిచయమట. ఇక అప్పటినుంచి శేఖర్ కి తన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక క్యారెక్టర్ అయితే ఇస్తు తనను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఛత్రపతి సినిమా చేసేటప్పుడు శేఖర్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ని సరిగ్గా పెట్టలేదట.

    ఇంక దాంతో కోపానికి వచ్చిన రాజమౌళి వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధానికి గుర్తుగా నవ్వుతూ బాగా చేయమని చిన్న వీపు మీద రెండు దెబ్బలు వేసాడట. ఇక దానికి శేఖర్ కూడా నవ్వుతూ ఇప్పుడు బాగా చేస్తాను అని చెప్పాడట. ఇక రాజమౌళి తమ ఫ్రెండ్షిప్ కి గుర్తుగా అలా చేసాడు తప్ప ఇప్పటి వరకు ఆయన నన్ను ఎప్పుడు తిట్టాను కూడా తిట్టలేదు అంటూ శేఖర్ ఒక సందర్భం లో ఈ విషయాన్ని తెలియజేశాడు…