Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila: వైఎస్‌ షర్మిల – బ్రదర్‌ అనిల్‌ లవ్‌స్టోరీ గురించి తెలుసా..

YS Sharmila: వైఎస్‌ షర్మిల – బ్రదర్‌ అనిల్‌ లవ్‌స్టోరీ గురించి తెలుసా..

YS Sharmila: వైఎస్‌.షర్మిల.. పరిచయం గానీ, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కానీ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి కుమార్తెగా, ఇటు ప్రస్తుతం ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెల్లిగా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తెలంగాణలో పార్టీ పెట్టినా.. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరి ఏపీలో పనిచేస్తున్నా.. ఆమెకు వైఎస్సార్‌ కూతురుగా, జగన్‌ చెల్లిగానే మంచి గుర్తింపు ఉంది. ఏపీలో వైసీపీ గెలవడానికి షర్మిల కూడా కారణం అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. కొన్ని కారణాలతో అన్నతో విభేదించి తెలంగాణలో వైఎస్సార్‌టీపీ ఏర్పాటు చేశారు. పాదయాత్రలు చేశారు. కానీ, ప్రజల నుంచి ఆదరణ లభించలేదు. ఇక ఇటీవల తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపారు. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్నారు. ఇక షర్మిల పర్సనల్‌ విషయానికి వస్తే చాలా తక్కువ మందికి తెలుసు.

ప్రేమ వివాహం..
ఇక షర్మిల ఒక క్రమశిక్షణ గల నేత ఇంట్లో పుట్టింది. క్రిష్టియన్‌ ఫ్యామిలీ. ఇక షర్మిల తల్లిదండ్రులను విభేదించి 1999లో ఒక బ్రాహ్మణ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇందుకోసం ఆమె అమెరికాకు వెళ్లింది. ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుని తర్వాత తన తండ్రి వైఎస్సార్‌కు విషయం చెప్పింది. ఈ విషయాలను ఆమే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

చదువుకునే రోజుల్లో..
రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యం ఉన్న ఫ్యామిలీలో పుట్టిన షర్మిల ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌ వెళ్లింది. అక్కడ మొదటిసారి బ్రదర్‌ అనిల్‌ను కలిసిందట. షర్మిల స్నేహితులు ఏర్పాటు చేసిన ఓ మీటింగ్‌కు అనిల్‌ కూడా వచ్చారట. ఈ మీటింగ్‌ తర్వాత ఇద్దరూ తరచూ కలిసేవారు. ఆ సమయంలోనే బ్రదర్‌ అనిల్‌ ప్రేమలో పడింది షర్మిల. అనిల్‌ షర్మిలకు ప్రపోస్‌ చేశారట. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అనిల్, క్రైస్తవ మతానికి చెందిన షర్మిల ప్రేమించుకోవడం అప్పట్లో వైఎస్సార్‌ కుటుంబంలో పెద్ద సంచలనంగా మారిందట.

పెళ్లికి అంగీకరించకుండా..
వైఎస్సార్‌కు కూతురు అంటే చాలా ప్రేమ. ఇక షర్మిలకు జీసెస్‌ అంటే చాలా ఇష్టం. ఆమె ఏం కావాలన్నా తండ్రిని, తర్వాత దేవుడిని మాత్రమే కోరుకునేవారు. ఇంత దైవభక్తి ఉన్న షర్మిల తమ మతం కాని, ఒక సంప్రదాయ బ్రాహ్మణుడిని ప్రేమించింది. ఒకరోజు తన తల్లిద్వారా ఈ విషయాన్ని వైఎస్సార్‌కు తెలిపిందట. దీంతో వైఎస్సార్‌ షాక్‌ అయ్యాడట. తన జీవితంలో ఎన్నడూ బాధపడనంతగా బాధపడ్డాడట. అనిల్‌ గురించి కూడా తెలుసుకుని వేర్వేరు మతాల వారు కలిసి ఉండలేరని కూతురుకు నచ్చజెప్పారట. పెళ్లి చేసుకుంటూ.. ఇటు తన తరఫున, అటు విజయమ్మ తరఫునవారు దూరమవుతారని తెలిపారట. కానీ షర్మిల మాత్రం తాను పద్ధతుల విషయంలో ఎలాగైనా ఉండగలనని, సర్దుకు పోతానని చెప్పిందట.

అమెరికాకు పంపించి..
అనిల్‌తో పెళ్లికి వైఎస్సార్‌ అంగీకరించకపోవడంతో షర్మిల మానసికంగా ఇబ్బంది పడిందట. ఈ క్రమంలో కొన్ని రోజులు అమెరికా వెళ్తానని తండ్రికి చెప్పిందట. దీంతో అమెరికా వెళ్తే తన కూతురు ఇక్కడి విషయాలు కూడా మర్చిపోతుందని వైఎస్సార్‌ అంగీకరించాడట. కానీ షర్మిల అమెరికాలో అనిల్‌ను ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుంది. తర్వాత తండ్రికి ఫోన్‌ చేసి చెప్పడంతో షాక్‌ అయ్యాడట. ఇలా షర్మిల తనను ప్రేమించిన అనిల్‌ కోసం అమెరికా వెళ్లి పెళ్లి చేసుకుందట. తర్వాత రెండు కుటుంబాలు కలిపిసోయాయి. తండ్రి కూతురు మధ్య వచ్చిన గ్యాప్‌ కూడా సమసిపోయింది. అనిల్‌ తర్వాత క్రైస్తవ మతం స్వీకరించారు. వైఎస్సార్‌కు నచ్చిన, మెచ్చిన, ఇష్టమైన అల్లుడిగా మారిపోయారట. ఇక షర్మిల – అనిల్‌ కూడా అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. షర్మిల రాజకీయ విషయంలో కూడా అనిల్‌ పూర్తిగా సపోర్టు చేస్తారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version