Kodali Nani : కొడాలి నాని నామినేషన్ తిరస్కరించే ధైర్యం ఉందా?

జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు వెళ్లడంతో ఆయన కొడాలి నానితో పాటు టిడిపి నేతలు కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పుడు కొడాలి నాని కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. అది అకామిడేట్ భవనం కాదని.. క్యాంపు కార్యాలయం అంటూ చెప్పుకొస్తున్నారు.

Written By: NARESH, Updated On : April 29, 2024 9:39 am

https://dm0ok23rtivjr.cloudfront.net/wp-content/uploads/2024/04/Do-you-have-the-guts-to-reject-Kodali-Nanis-nomination.jpg

Follow us on

Kodali Nani : కొన్ని విషయాలను మాత్రమే నోటితో చెప్పగలం. అయితే ఈ విషయంలో కొడాలి నాని ముందుంటారు. ఎంత వారైనా, ఎంత యోధాను యోధులైనా వారిపై మాట్లాడగల సత్తా కొడాలి నానికి ఉంది. కానీ ఎన్నికల నామినేషన్ విషయానికి వచ్చేసరికి నోరు మాదిరిగా.. తప్పటడుగులు వేస్తామంటే కుదరదు. ఇప్పుడు అదే చేశారు కొడాలి నాని. అడ్డంగా బుక్కయ్యారు. ఇంతవరకు కొడాలి నాని నామినేషన్ అధికారికంగా ఆమోదించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదంగా మారింది. రిటర్నింగ్ అధికారిగా ఉన్న ఆర్డీవో కొడాలి నాని మనిషన్న ఆరోపణ ఉంది. దీంతో సహజంగానే సదరు అధికారి పట్టించుకోలేదు. దీంతో టీడీపీ నేతలు జిల్లా ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.

కొడాలి నాని మున్సిపల్ కార్యాలయాన్ని తన సొంత అవసరాలకు వాడుకున్నారు. కానీ అఫీడవిట్లో దానిని చూపించలేదు. టిడిపి నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఇది వివాదంగా మారింది. టిడిపి నేతలు అయితే పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. కొడాలి నాని ప్రభుత్వ భవనాన్ని వాడుకున్న విషయాన్ని ఆధారాలతో సహా ఇచ్చారు. అయితే కొడాలి నాని కూడా రాత్రికి రాత్రి మున్సిపల్ కార్యాలయం నుంచి అద్దెకు తీసుకున్నది నిజమే కానీ.. బకాయిలు ఏమీ లేకుండా చెల్లించేసారని ధ్రువపత్రాలు పుట్టించి అధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే తాము బకాయి గురించి ప్రస్తావించలేదని.. ఆ భవనాన్ని వాడుకుంటూ.. వాడలేదని చెప్పడం పైనే తమ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు టిడిపి నేతలు గుర్తు చేస్తున్నారు.

జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు వెళ్లడంతో ఆయన కొడాలి నానితో పాటు టిడిపి నేతలు కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పుడు కొడాలి నాని కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. అది అకామిడేట్ భవనం కాదని.. క్యాంపు కార్యాలయం అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే నిన్న ఆదివారం కావడంతో అధికారులు ఈ అభ్యంతరాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే రిటర్నింగ్ అధికారిగా ఉన్న ఆర్డీవో.. కొడాలి నాని అస్మదీయ అధికారి అని.. ఆయనకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేదని టిడిపి నేతలు చెబుతున్నారు. అందుకే జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొస్తున్నారు. అయితే సోమవారం కొడాలి నాని నామినేషన్ వ్యవహారం పై ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.