Chandrababu On DK Shivakumar: చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా? బిజెపి కంటే హస్తం పార్టీయే బెటర్ అని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. షర్మిల కు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు, వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు వెనుక ఏదో ఒక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన ద్వారానే చంద్రబాబు కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అదే ఊపుతో తెలంగాణలో సైతం సత్తా చాటింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా పోటీ నుంచి తప్పుకుంది. ఆ పార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు టర్న్ అయినట్లు విశ్లేషణలు వచ్చాయి. అయితే అవినీతి కేసుల్లో అరెస్టు, తదనంతర పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ప్రత్యేక ఆలోచనలు చేస్తున్నారు. బిజెపి కంటే కాంగ్రెస్ బెటర్ అని భావిస్తున్నారు. జాతీయస్థాయిలో బిజెపి కంటే కాంగ్రెస్ తోనే స్నేహం చేయడం శ్రేయస్కరమని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జగన్ నియంత్రించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సహకారంతో వ్యూహరచన చేస్తున్నారు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడం ద్వారా వైసీపీకి ప్రత్యామ్నాయాన్ని తయారు చేయాలని భావిస్తున్నారు. అయితే ఇదంతా డీకే శివకుమార్ వ్యూహరచనగా తెలుస్తోంది. మొన్నటి వరకు జగన్ కు డీకే శివకుమార్ సన్నిహితుడైన అంతా భావించారు. కానీ అక్కడ బిజెపితో జగన్ సయోధ్య ఉంది. మొన్నటి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని జగన్ చూశారు. అందుకే ఈసారి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన ప్రతాపాన్ని జగన్ కు చూపించాలని భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఏపీలో ఎంత అభివృద్ధి చేస్తే.. జగన్ ను నిర్వీర్యం చేయవచ్చని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీతో కాంగ్రెస్ పార్టీకి నామరూపాలు లేకుండా చేసిన జగన్ పై.. కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి కోపం ఉంది. అవసరమైతే చంద్రబాబు అధికారంలోకి రావాలి కానీ.. జగన్ రావడానికి వీలు లేదని.. వైసీపీ కానీ ఓడిపోతే ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల క్రమంలో ఇటీవల బెంగళూరు ఎయిర్ పోర్టులో డీకే శివకుమార్ ను చంద్రబాబు కలిశారు. అందుకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని.. కాంగ్రెస్ పార్టీతో అడుగులు వేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.