Homeఆంధ్రప్రదేశ్‌Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ జైలుకెళ్లడం తప్పదా? హైకోర్టులో సంచలనం

Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ జైలుకెళ్లడం తప్పదా? హైకోర్టులో సంచలనం

Ram Gopal Varma :  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లో భయం ప్రారంభం అయ్యిందా? అందుకే ఆయన కోర్టును ఆశ్రయించారా? క్వాష్ పిటిషన్ దాఖలు చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు రామ్ గోపాల్ వర్మ. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగామహిళలని కూడా చూడకుండా నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలపై కామెంట్స్ చేశారు. దానిపై తాజాగా ఫిర్యాదులు రావడంతో రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లాలో కేసు నమోదు అయింది. హైదరాబాద్ వెళ్ళిన పోలీసులు రామ్ గోపాల్ వర్మ కు నోటీసులు కూడా అందించారు. ఈ తరుణంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ ఏపీ హైకోర్టు అందుకు నిరాకరించింది. ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగుల గురించి తెలుసుకొని మరి రద్దు చేసింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు కూడా నిరాకరించింది. దీంతో రాంగోపాల్ వర్మ అరెస్టుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా పోయాయి.

* ఆ భయంతోనే
సాధారణంగా రామ్ గోపాల్ వర్మ దేనికి భయపడరు. గతంలో కూడా ఆయనపై చాలా రకాల వివాదాలు నడిచాయి. కోర్టు కేసులను కూడా ఆయన ఎదుర్కొన్నారు. అయితే ఈసారి పోలీసులు ఇచ్చిన నోటీసులతో భయపడకుండా ఉండలేకపోయారు. సైబర్ నేరాలకు సంబంధించి కఠిన సెక్షన్లు అమల్లోకి రావడమే అందుకు కారణం. ఒకసారి జైలుకు వెళ్తే జీవితాంతం కేసులు వెంటాడక తప్పవు. అందుకే రామ్ గోపాల్ వర్మ ఎక్కువగా భయపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే అప్పట్లో ఆయన పెట్టిన వివాదాస్పద కామెంట్లు ఇప్పుడు శాపంగా మారాయి. మెడకు చుట్టుకుంటున్నాయి.

* పరువు పోతుందని
సినీ రంగంలో తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నారు రామ్ గోపాల్ వర్మ. బాలీవుడ్లో సైతం ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే అటువంటి రాంగోపాల్ వర్మ వైసిపి వికృత రాజకీయ క్రీడకు దగ్గరయ్యారు. గత ఐదేళ్ల వైసిపి హయాంలో ఆయన ప్రభుత్వం నుంచి కోటిన్నర వరకు తీసుకొని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అప్పటి ప్రతిపక్ష నేతలపై జుగుప్సాకరమైన ట్వీట్స్ చేశారు. కుటుంబాలను సైతం కించపరిచేలా మాట్లాడారు. మార్ఫింగ్ ఫోటోలు పెట్టి మరీ వివాదాస్పద కామెంట్లు చేశారు. దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు అరెస్ట్ అయితే.. అప్రదిష్ట మూటగట్టుకోవడం ఖాయం. అందుకే కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయినా సరే ఆయన చేసిన కామెంట్స్ ను చూసిన న్యాయమూర్తులు సైతం ఆశ్చర్యపోయారు. అందుకే ఎటువంటి రక్షణ కల్పించే తీర్పు ఇవ్వలేదు. దీంతో రాంగోపాల్ వర్మ అరెస్టు తప్పదన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version