Naga Chaitanya: అక్కినేని హీరో నాగ చైతన్య రెండో వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ సమంతకు ఆయన 2021లో విడాకులు ఇచ్చారు. అనంతరం మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడ్డారు. రెండేళ్లకు పైగా డేటింగ్ చేస్తున్న ఈ జంట పెళ్ళి బంధంతో ఒక్కటి కానున్నారు. ఆగస్టు 8న హైదరాబాద్ లోని నాగార్జున నివాసంలో నాగ చైతన్య-శోభితల నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. మంచి ముహూర్తం కోల్పోకూడదనే హడావుడిగా ఎంగేజ్మెంట్ జరిపామని అనంతరం నాగార్జున వివరణ ఇచ్చారు.
డిసెంబర్ 4న పెళ్ళికి ముహూర్తం కుదిరింది. నాగ చైతన్య-శోభితల పెళ్లి కార్డ్ వైరల్ అవుతుంది. శుభలేఖలో నాగార్జున, అమల పేర్లతో పాటు నాగ చైతన్య తల్లి లక్ష్మి, స్టెప్ ఫాదర్ విజయ్ రాఘవన్ పేర్లు కూడా జోడించడం విశేషం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు, దగ్గుబాటి రామానాయుడు దంపతుల పేర్లు పొందుపరిచారు. బంధువులు, సన్నిహితులు, ప్రముఖులకు పెళ్లి కార్డులు పంచుతున్నారు.
వైజాగ్ వేదికగా నాగ చైతన్య-శోభితల వివాహం జరగనుందని సమాచారం. ఇదిలా ఉండగా పెళ్ళికి ముందే నాగ చైతన్య శోభితకు కొన్ని కండీషన్స్ పెట్టాడట. ఏకంగా ఆమె పేరునే మార్చేస్తున్నాడట. అందుకు నాగ చైతన్య తల్లి కారణమట. నాగ చైతన్య మదర్ లక్ష్మి కోరిక మేరకు శోభిత పేరును మారుస్తున్నారట. వివాహం అనంతరం లక్ష్మి శోభితగా నాగ చైతన్య భార్య పేరు ఉండనుందట.
తన పేరుకు ముందు నాగ చైతన్య తల్లి పేరును జోడించేందుకు శోభిత అభ్యంతరం చెప్పలేదట. అలాగే పెళ్లిలో హెవీ మేకప్ ఉండకూడదని కూడా నాగ చైతన్య తల్లి లక్ష్మి ఆదేశించారట. సాంప్రదాయ చీరకట్టు, నార్మల్ మేకప్ తో సహజంగా కనిపించాలని అన్నారట. ఈ రెండు కండిషన్స్ కి శోభిత అంగీకరించారని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లక్ష్మిని వివాహం చేసుకున్న నాగార్జున విడాకులు ఇచ్చారు. అనంతరం హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
దగ్గుబాటి లక్ష్మి చెన్నై కి చెందిన వ్యాపారవేత్త విజయ్ రాఘవన్ ని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక అబ్బాయి సంతానం అని సమాచారం. బాల్యంలో నాగ చైతన్య తల్లి వద్దే పెరిగాడు. అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చేవాడట. కొన్ని రోజులు తండ్రి నాగార్జున వద్ద గడిపి తిరిగి చెన్నై వెళ్లిపోయేవాడు. హీరోగా నాగ చైతన్యను నాగార్జున పరిచయం చేశాడు.