spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Mohan Reddy Amaravati Farmers: జగన్ ను అమరావతి రైతులు కలిశారా.....

YS Jagan Mohan Reddy Amaravati Farmers: జగన్ ను అమరావతి రైతులు కలిశారా.. కలిపించారా

YS Jagan Mohan Reddy Amaravati Farmers: అమరావతి( Amravati capital) రైతుల తరఫున పోరాటం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమరావతి రైతులకు న్యాయం చేయాలన్న డిమాండ్ జగన్ నుంచి కిందిస్తాయి నేత వరకు ఇప్పుడు వినిపిస్తోంది. చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి సైతం అమరావతి రైతుల ప్రస్తావన తీసుకొస్తున్నారు. అందుకే ఫైనల్ గా అమరావతి రైతులను అడ్డం పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే అమరావతి ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలను తీసుకువెళ్లారు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు. తప్పకుండా న్యాయం చేస్తానని.. అమరావతి రైతులకు అండగా నిలబడతానని ఆయన భరోసా ఇచ్చారు. ఇప్పుడు అందరిలోనూ అనుమానం అదే. అంటే అమరావతి రైతుల ఉద్యమాన్ని తెరపైకి తెస్తారా అనే అనుమానం కలుగుతుంది. అయితే ఇన్ని గందరగోళాల నడుమ జగన్మోహన్ రెడ్డి అటువంటి స్టాండ్ తీసుకుంటే అమరావతి ప్రజలు నమ్ముతారా. అసలు జగన్మోహన్ రెడ్డిని రైతులు విశ్వసిస్తారా అనేది ఒక అనుమానమే.

* మహిళా రైతు..
అమరావతి ప్రాంతానికి చెందిన శేషగిరమ్మ( sasagiramma ) అనే 80 సంవత్సరాల వృద్ధురాలు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. బ్రహ్మ కుమార్ అనే వ్యక్తి ఆమెను జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. ఆమెకు అమరావతి ప్రాంతంలో ఐదు సెంట్ల నివాస స్థలం ఉంది. అక్కడే ఆమె నివసిస్తున్నారు. ఆ కుటుంబమంతా చనిపోయింది. ఒక్క మనవరాలు మాత్రమే మిగిలారు. ఆమెతోనే ఆ ఇంట్లో ఉంటున్నారు. అయితే రహదారి నిర్మాణానికి అడ్డంగా ఉందని చెప్పి ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు సి ఆర్ డి ఏ అధికారులు. అయితే ఉన్నఫలంగా ఎక్కడికి వెళ్ళిపోతాం అని.. తమకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వాలని ఆమె కోరారు. కానీ అంత తక్కువ స్థలానికి టిడిఆర్ బాండ్లు మాత్రమే ఇవ్వగలమని సిఆర్డిఏ అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ వివాదం నడుస్తుండగా బాధితురాలు జగన్మోహన్ రెడ్డిని కలవడంపై విస్మయం వ్యక్తం అవుతోంది. అధికారంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ను కలిస్తే కొంత ప్రయోజనం ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి వద్దకు ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్లారు అంటే దీని వెనుక ఏదో జరగబోతోంది అన్న అనుమానం ఉంది.

* ఇప్పటికీ ఆ గుర్తులు..
అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రైతులకు చుక్కలు చూపించారు. వారి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారు. కేసులతో ఉక్కు పాదం మోపారు. వారికి కనీసం కౌలు చెల్లించలేదు. వారి నుంచి సేకరించిన భూములను ఉచిత ఇంటి స్థలాల పేరిట పంచేందుకు సిద్ధపడ్డారు. ఐదేళ్ల వైసిపి హయాంలో ఒక్కరోజు కూడా అమరావతి రైతు పేరు వినిపించలేదు జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి. కానీ ఇప్పుడు అమరావతి రైతు ఆయనను కలవడం.. అండగా ఉంటామని చెప్పడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు అర్థమవుతోంది.

* అడుగడుగునా గందరగోళం..
అయితే జగన్మోహన్ రెడ్డి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. అమరావతి రాజధానిని ఆహ్వానించారు. తరువాత మూడు రాజధానులు అంటున్నారు. ఇప్పుడు కొత్తగా మావిగన్ పేరు వినిపిస్తున్నారు. అదే సమయంలో మీడియా ముందుకు వచ్చి రాష్ట్రాలకు రాజధాని అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. అమరావతిని కొనసాగిస్తానని చెప్పడం లేదు. అప్పుడెప్పుడో మూడు రాజధానులకు బ్రేక్ పడినప్పుడు.. ఇదే మావిగన్ ప్రతిపాదన తేలేకపోయారు. అసలు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మిగిల్చాలనుకుంటున్నారా అనేది కూడా కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు. అసలు అధికారంలో లేని జగన్మోహన్రెడ్డిని శేషగిరమ్మ ఎందుకు కలిశారు? మున్ముందు అమరావతి రైతుల ఉద్యమాన్ని తీసుకుంటారా అనేది ఒక అనుమానం. కానీ అది విఫల ప్రయత్నమే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన గత చర్యలే అందుకు కారణం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version