Nandigam Suresh arrest : ప్రస్తుతం ఏపీలో కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో నాడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడికి సంబంధించిన కేసును పోలీసులు తిరగతోడడం మొదలుపెట్టారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అరెస్టుల పర్వం మొదలైంది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా కొంతమంది వైసిపి కీలక నేతలు ముందస్తు బెయిల్ కోసం కోర్టును సంప్రదించగా.. కోర్టు దానికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.. టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి జరిగిన కేసులో పోలీసులకు చిక్కకుండా సురేష్ తల దాచుకోవాలని భావించాడు. అయితే ఇదే సమయంలో వైసీపీ నేతలే పోలీసులకు సమాచారాన్ని చేరవేశారని ప్రచారం జరుగుతోంది. సురేష్ అరెస్టు ద్వారా ప్రజల్లో సానుభూతి పొందాలనే ప్రణాళికతో పోలీసులకు సమాచారాన్ని అందించారని తెలుస్తోంది. టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడికి సంబంధించిన కేసులో ఏపీ పోలీసులు ముందుగా సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న నాయకులు మాదిరే సురేష్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు.. “ప్రజల్లో సానుభూతి పొందాలంటే కచ్చితంగా ఏదో ఒకటి జరగాలి. అలా జరగాలంటే సురేష్ ను అరెస్టు చేయించడం ఒకటే మార్గమని భావించారు. ఆ ప్రణాళికను సజ్జల రామకృష్ణారెడ్డి విజయవంతంగా అమలు చేశారని” మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేయడం సురేష్ అరెస్ట్ వెనుక అసలు సంగతిని బయటపెట్టింది..” ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేసిన పెద్దగా ఫలితం ఉండదు. సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేస్తే అసలు విషయం తెలుస్తుంది. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తామని చాలామంది నేతలకు నాటి వైసిపి పెద్దలు ఆఫర్ ఇచ్చారు.. అప్పటి ప్రభుత్వ పెద్దల కళ్ళల్లో ఆనందం చూసేందుకు కొంతమంది నాయకులు బరితెగించారు.. ఎలాగూ ప్రభుత్వం తమదే అనే భరోసాతో రెచ్చిపోయారు. ఇష్టానుసారంగా దాడులకు పాల్పడ్డారని” మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు.
త్వరలో మరిన్ని అరెస్టులు
అయితే నాటి ఘటనలో ఇంకా చాలామంది వైసిపి నాయకులు ఉన్నారని.. వారిని కూడా అరెస్టు చేయాలని టిడిపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు..” ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి జరిగింది. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. కార్యాలయం అద్దాలు పగలగొట్టారు. సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు.. వైసిపి నాయకులు రౌడీ మూకల మాదిరి రావడంతో కార్యాలయం వదిలిపెట్టి పారిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి దాడులు మళ్లీ జరగకుండా ఉండాలి అంటే కచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ దాడులు ప్రజాస్వామ్యంలోనే పెద్ద మచ్చ. ఇలాంటి దాడులకు పాల్పడిన వ్యక్తులకు తగిన శిక్ష పడాల్సిందేనని” టిడిపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సురేష్ మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది వైసిపి నాయకులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నాటి ఘటనకు సంబంధించి సి సి ఫుటేజ్ లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Did that ycp key leader give the information behind the arrest of nandigam suresh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com