https://oktelugu.com/

Nagababu: నాగబాబు ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేశాడా? అసలేంటి కారణం?

నాగబాబు ట్విట్టర్ ఖాతా డిలీట్ చేయడానికి అల్లు అర్జున్ అభిమానులు కారణమని ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల కిందట అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Written By:
  • Dharma
  • , Updated On : May 17, 2024 / 10:34 AM IST

    Nagababu

    Follow us on

    Nagababu: మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సమకాలిన అంశాలపై స్పందిస్తుంటారు. రాజకీయ ప్రత్యర్థులపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతుంటారు.ఒక్కోసారి వివాదాలను కొని తెచ్చుకుంటారు. గతంలో బాలకృష్ణను ఉద్దేశించి.. బాలయ్య అంటే ఎవరు? పాత సినిమాల్లో కమెడియనా? అని పోస్ట్ చేసి వివాదానికి కారణమయ్యారు. నందమూరి అభిమానులను హర్ట్ చేశారు. అయితే అటువంటి నాగబాబు ఇప్పుడు తన ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేయడం చర్చకు దారితీసింది. దానికి కారణం ఏమిటన్నది తెలియడం లేదు. ఫలితాలకు ముందే నాగబాబు చేతులెత్తేసారని.. ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేశారని ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి.

    అయితే నాగబాబు ట్విట్టర్ ఖాతా డిలీట్ చేయడానికి అల్లు అర్జున్ అభిమానులు కారణమని ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల కిందట అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నాగబాబు ఒక ట్విట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే.. మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అసలు నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ ట్విట్ చేశారన్నది క్లారిటీ లేదు. కానీ ఎవరికి తగినట్లుగా వారు దానిమీద స్పందిస్తూ పెద్ద రాద్ధాంతం చేశారు. అల్లు అర్జున్ అభిమానులు సైతం నాగబాబుని టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెట్టారు.

    గత కొద్దిరోజులుగా మెగా కుటుంబంలో చీలిక అంటూ ప్రచారం ప్రారంభమైంది. ఈ వివాదం మరింత ముదరడంతో నాగబాబు తాజాగా తన ట్విట్టర్ ఎకౌంటు డి ఆక్టివేట్ చేశారు. నిజానికి పవన్ కు మద్దతుగా మెగా కుటుంబమంతా రంగంలోకి దిగింది. కానీ అల్లు అర్జున్ మాత్రం కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మద్దతు ప్రకటించారు. తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి కోసం నేరుగా వెళ్లారు. ఇదే వివాదానికి కారణం. అదే సమయంలో నాగబాబు పోస్ట్ పెట్టడంతో వివాదానికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. అందుకే నాగబాబు తన ట్విట్టర్ ఖాతాను డి ఆక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.