https://oktelugu.com/

Devineni Uma: మైలవరం నుంచి దేవినేని ఉమా అవుట్

గత ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసిన దేవినేని ఉమా పై వసంత కృష్ణ ప్రసాద్ పొందారు. ఈ ఎన్నికల్లో ఉమా పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా వసంత కృష్ణ ప్రసాద్ షాక్ ఇచ్చారు.

Written By:
  • Dharma
  • , Updated On : March 7, 2024 / 11:19 AM IST

    Devineni Uma

    Follow us on

    Devineni Uma: తెలుగుదేశం పార్టీలో చాలామంది సీనియర్లకు మొండి చేయి తప్పదనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబుకు, లోకేష్ కు ప్రీతిపాత్రుడైన మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఈసారి పార్టీ టికెట్ లేనట్టేనని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో దేవినేని ఉమా పేరు లేదు.దీంతో రెండో జాబితాలోనైనా తన పేరును ప్రకటిస్తారని ఉమా భావించారు. కానీ ఈసారి టిక్కెట్ లేదని చంద్రబాబు తేల్చేసినట్లు సమాచారం. అదే విషయాన్ని ఉమాకు చెప్పేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

    గత ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసిన దేవినేని ఉమా పై వసంత కృష్ణ ప్రసాద్ పొందారు. ఈ ఎన్నికల్లో ఉమా పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా వసంత కృష్ణ ప్రసాద్ షాక్ ఇచ్చారు. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటినుంచి ఉమా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.మైలవరం టికెట్ హామీ తోనే వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలో చేరారు.దీంతో తమకు సన్నిహితుడైన ఉమాను ఏం చేయాలి అని చంద్రబాబు ఆలోచించారు.ఉమా ను పెనుమలూరు వెళ్లాలని సూచించారు.అయితే ఇప్పటికే అక్కడ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆశావహుడిగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాను ఒప్పుకోనని ఆయన తేల్చి చెప్పడంతో ఉమా తిరిగి వెనక్కి రావాల్సి వచ్చింది.

    తొలి జాబితా ప్రకటన తర్వాత దేవినేని ఉమా చంద్రబాబును నేరుగా కలిశారు. మైలవరం టిక్కెట్ కావాలని కోరారు. రెండో జాబితాలో ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం తనకు మైలవరం టికెట్ కావాలని పట్టుబట్టారు. అటు సర్వేలు సైతం వసంత కృష్ణ ప్రసాద్ కు అనుకూలంగా ఉన్నాయి. దీంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. అయితే ఉమా పెనమలూరు వెళ్తామంటే టికెట్ కేటాయిస్తానని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. అదే విషయాన్ని అచ్చె నాయుడు ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఈసారి ఎన్నికల్లో మైలవరం టిక్కెట్ ఇవ్వమని.. వేరేచోట సర్దుబాటు చేస్తామని.. తన మాటగా చెప్పాలని చంద్రబాబు సూచించారు. అయితే అధినేత చంద్రబాబు తో పాటు లోకేష్ పై దేవినేని ఉమా వీర విధేయత చూపుతారు. అటువంటి నాయకుడే మైలవరం నుంచి అవుట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనతో గడుపుతున్నారు. దేవినేని ఉమా లాంటి నేతలకే ఇలాంటి పరిస్థితి వచ్చిందని.. తమలాంటి వారి విషయంలో ఎలా ఉంటుందోనన్న బెంగ వారిని వెంటాడుతోంది.