Kurnool : కర్నూలు ఆత్మకూరు పట్టణానికి చెందిన దేవరశెట్టి వినోద్ కుమార్ ఓ వింత పని చేస్తున్నాడు. ఈయన అందరికంటే విభిన్నంగా ఆలోచించి కరెన్సీని 33 సంవత్సరాలుగా సేకరిస్తున్నాడు. దీంతో ఆయన వద్ద ఇప్పుడు చాలా అరుదైన నాణేలు, నోట్లు ఉన్నాయి. ఇప్పటివి మాత్రమే కాదు రాజుల కాలం నాటి పురాణ నాణాలు కూడా ఉన్నాయి. ఆత్మకూరు పట్టణం నేతాజీ నగర్ లో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు ఆయన. నోట్ల కరెన్సీ సేకరణతో 33 సంవత్సరాలుగా వివిధ దేశాల నోట్లను రాజుల కాలం నాటి పురాతన నాణేలను కూడా ఈయన సేకరించారు.
బంధువులు కుటుంబ సభ్యుల సహాయంతో ఇది సాధ్యమైందట. అంతేకాకుండా హంపి ధర్మస్థల మైసూరు తంజావూర్ తదితర పర్యాటక ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ లభించే, అరుదైన కరెన్సీ కొనుగోలు చేశాడట. ఇది తన గురువు సాంబశివరావు 1992 సంవత్సరంలో కర్నూలులో ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల పదవ తరగతి చదువుతున్నప్పుడు చెప్పారని అప్పటి నుంచి సేకరిస్తున్నట్టు తెలిపాడు.
భారత దేశ చరిత్రలో కరెన్సీ చలామణిలో అతి తక్కువ విలువ కలిగిన కాయిన్ ల దగ్గర నుంచి కూడా ఆయన దగ్గర ఉన్నాయి. బొట్టు, అణాతో పాటు దమ్మిడి, పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు ,పది పైసల నుంచి 1000 కాయిన్ వరకు నాణేలు ఆయన వద్ద ఉన్నాయి. అలాగే ఆయా సంవత్సరంలో రిజర్వ్ బ్యాంకు నుంచి విడుదలైన ప్రతి కాయిన్ ను నోటును కూడా ఆయన వద్ద ఉంచుకున్నారు. మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ విడుదల చేసిన కరెన్సీ తో పాటు నిజాం పాలనలలో కరెన్సీ కూడా ఉందట. అంతేకాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రతి కరెన్సీ కూడా ఆయన వద్ద ఉంది.
మన దేశంలో మాత్రమే కాదు విదేశాలకు చెందిన అరుదైన కరెన్సీ నానాలు కూడా ఆయన వద్ద ఉన్నాయి. ఇండియాతో పాటు నేపాల్, జపాన్, సింగపూరు, పిలిపిన్స్, యూరప్, యుగస్లేవియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, చైనా, సౌత్ ఆఫ్రికా, లిబియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా కువైట్ దుబాయ్ అమెరికా, ఇంగ్లాండ్ ,కెనడా, ఉత్తరకొరియా, జర్మనీ, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్, భూటాన్, జింబాబ్వే, తదితర దేశాలకు చెందిన కరెన్సీ నాణేలు కూడా ఆయన వద్ద ఉండటం గమనార్హం.
ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రారంభానికి ముందు కొనసాగిన కరెన్సీ తోపాటు తర్వాత వచ్చిన కరెన్సీని కూడా సేకరించాడట. అంతేకాదు నిజాం నవాబు కాలంనాటి అరుదైన ముద్రిత నాణేలను కూడా సేకరించాడట. అయితే ఈ పలు కరెన్సీ నాణేలు నోట్ల కోసం లక్షల రూపాయలు చెల్లించాడట. అయితే కరెన్సీ సేకరణకు భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ.. దీనికి కుటుంబ సభ్యుల సహకారం కూడా అందుతుందని వినోద్ సంతోషం వ్యక్తంచేశారు. దేశ విదేశాల్లో ఉన్న పురాతన కరెన్సీ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలన్నది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. మరింత విదేశీ కరెన్సీ సేకరించాల్సి ఉందని, సాధ్యమైనంత వరకు వాటిని సేకరిస్తాను అన్నారు. కరెన్సీ నోట్ల ప్రదర్శన ఉంటే దీని ద్వారా పిల్లలకు వీటి గురించి తెలియజేయాలని ఉందన్నారు.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Devarasetty vinod kumar has been collecting banknotes and ancient coins for 33 years
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com