తెలంగాణ వాళ్లకి ‘నా తెలంగాణ’ భావన.. ఆంధ్రులకేది? : ఏపీలో( Andhra Pradesh) వరుసగా జనసేన నేతలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా లైంగిక వేధింపుల కేసులు ఆ పార్టీ నేతలకు ఎదురవుతున్నాయి. మొన్నటికి మొన్న తిరుపతికి చెందిన కిరణ్ రాయల్ పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వివాదం మరువక ముందే మరో జనసేన నేత బాగోతం ఒకటి బయటపడింది. ఓ మహిళా డాక్టర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన ఇంచార్జ్ పై పవన్ కళ్యాణ్ వేటు వేశారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read : చంద్రబాబుకు షాక్.. తీవ్ర నిర్ణయం దిశగా పిఠాపురం వర్మ!
* అనుచిత వ్యాఖ్యలు
కూటమి( Alliance) అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన నేతల వ్యవహార శైలి మారింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన ఇన్చార్జిగా ఉన్నారు వరుపుల తమ్మయ్య బాబు( Tammayya Babu). తన ప్రాంతానికి చెందిన యువకులు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించేందుకు వెళ్లిన తన అనుచరుడు ఆయనకు ఫోన్ చేశాడు. దీంతో డాక్టర్ కు ఫోన్ ఇమ్మని తమ్మయ్య బాబు కోరాడు. ఆయన ఫోన్ ఇవ్వగానే బాధితులకు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ ఆయన ఎవరో తెలియదంటూ మాట్లాడలేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన తమ్మయ్య బాబు ఆసుపత్రికి చేరుకొని మహిళా డాక్టర్ పై బూతు పురాణం అందుకున్నారు.
* ఆస్పత్రి సిబ్బంది నిరసన
కేవలం అపరిచిత వ్యక్తిగా భావించి ఆ మహిళా డాక్టర్ శ్వేత( doctor Sweta ) మాట్లాడలేదు. దీంతో ఆసుపత్రికి వచ్చిన తమ్మయ్య బాబు దాడి చేసినంత పని చేశారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉద్యోగాలు చేయాలని సూచించారు. ప్రజల సొమ్ము తీసుకుని ఉద్యోగాలు చేస్తున్నారంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనిని వీడియో తీస్తున్న ఆసుపత్రి సిబ్బంది ఫోన్ తీసుకుని వీడియో డిలీట్ చేశారు. ఈ రచ్చకు నిరసనగా ఆసుపత్రిలో సిబ్బంది విధులను బహిష్కరించారు. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు వెళ్లడంతో ఆయన సీరియస్గా స్పందించారు. తమ్మయ్య బాబును బాధ్యతలు నుండి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Also Read : తెలంగాణ వాళ్లకి ‘నా తెలంగాణ’ భావన.. ఆంధ్రులకేది?