Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఎందుకు సంబంధం లేని వ్యవహారాల్లో తలదూర్చి లేనిపోనీ నెగటివిటీ ని మూటగట్టుకుంటున్నాడు? అని సోషల్ మీడియా లో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అధికారం సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది. కానీ ఒక్క సౌత్ లో మాత్రమే బాగా వెనుకబడింది. ఎంపీ ఎన్నికలలో సత్తా చాటుతుంది కానీ, అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చాటలేకపోతుంది. అందుకని బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ ని ఉపయోగించుకొని సౌత్ స్టేట్స్ లో అధికారం లోకి రావడానికి ప్రయత్నం చేస్తుందా?, అందుకే పవన్ కళ్యాణ్ చేత సనాతన ధర్మం గురించి ప్రచారం చేయిస్తుందా?, మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ వినిపించని వాదం ఇప్పుడు ఎందుకు ఇలా వినిపిస్తుంది?, పవన్ కళ్యాణ్ లో అకస్మాత్తుగా ఈ మార్పు ఏమిటి అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఆయన ఆవిర్భావ దినోత్సవం లో వివరణ కూడా ఇచ్చాడు.
Also Read: పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ కి మోక్షం దక్కేది అప్పుడేనా..?
హిందీ సమాజం అపవిత్రం అవుతుంటే సనాతన ధర్మం గొప్పదనాన్ని చెప్పకూడదా? అంటూ చెప్పుకొచ్చాడు. సరే అది కూడా పక్కన పెడుదాం, తమిళనాడు లో మూడు బాషల విధానం పై వ్యతిరేకంగా అక్కడి ప్రజలు, రాజకీయ నాయకులూ ఎప్పటి నుండో పోరాటం చేస్తున్నారు. వాళ్ళు కేవలం రాజకీయ లబ్ది కోసం, సెంటిమెంట్స్ ని రగిలించి ఈ వాదనని తీసుకొచ్చారు, అది వేరే విషయం అనుకోండి. కానీ పవన్ కళ్యాణ్ కి ఆ అంశంపై స్పందించాల్సిన అవసరం ఏముంది?, ఆవిర్భావ దినోత్సవ సభలో ఇవన్నీ మాట్లాడడం అవసరమా?, నేషనల్ లెవెల్ పాలిటిక్స్ పై ఫోకస్ చేస్తున్నాడా?, మరి స్టేట్ లెవెల్ పాలిటిక్స్ ని ఎవరు పట్టించుకుంటారు అనేది అభిమానుల్లో కలుగుతున్న ఆవేదన. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టాడు.
ఆంధ్ర ప్రదేశ్ లో గ్రామాల రూపు రేఖలు మారుతున్నాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రోడ్లను చూడని గ్రామాలూ కూడా ఇప్పుడు రోడ్స్ ని చూస్తున్నాయంటే అది పవన్ కళ్యాణ్ చొరవనే. దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా కేవలం ఆరు నెలల్లోనే ఆయన 4 వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేయించాడు. ఆయన వీటి ప్రస్తావన తీసుకొని వచ్చి, ఈ ఆరు నెలల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడో జనాలకు వివరించి ఉండుంటే అద్భుతంగా ఉండేది. అదే విధంగా భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం ఎలాంటి పనులు చేయబోతుంది?, జనసేన పార్టీ ని క్షేత్రస్థాయిలో ఎలా బలోపేతం చేయాలి వంటి అంశాల గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ వాటి గురించి ఆయన మాట్లాడలేదు. ఆవిర్భావ సభలో దేని గురించి మాట్లాడాలో, దాని గురించి మాట్లాడకుండా అవసరం లేని సబ్జక్ట్స్ పై మాట్లాడి అనవసరమైన నెగటివిటీ ని కొని తెచ్చుకుంటున్నాడని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.