OG Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నప్పటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ ను టచ్ చేసే హీరో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సైతం ఆయనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. అటు పొలిటికల్ గా రాణిస్తూ, ఇటు సినిమాలను చేస్తూ రెండు రకాలుగా ఆయన ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతున్నాడనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు సక్సెస్ గా నిలుస్తున్నప్పటికి ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
Also Read : ఒక డిప్యూటీ సీఎం గ్యాంగ్ స్టర్ అంటే జనాలు అంగీకరిస్తారా..? ‘ఓజీ’ చిత్రంపై అభిమానులు టెన్షన్!
ముఖ్యంగా సుజీత్ (Sujith) డైరెక్షన్ లో చేస్తున్న ఓజీ (OG) సినిమా విషయంలో ఆయన చాలావరకు ప్రీ ప్లాన్డ్ గా ఉంటూ ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవ్వకపోయిన కూడా సినిమా మీద అంచనాలు మాత్రం రోజురోజుకి తారాస్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంది.
అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాని 2025 దసర కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మే 9వ తేదీన ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) సినిమాను రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ అనౌన్స్ చేసిన నేపధ్యంలో ఈ సినిమా పూర్తయిన వెంటనే ఓజీ సినిమా మీద తన డేట్స్ ని కేటాయించాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాలకు డేట్స్ ని కేటాయించలేకపోతున్నాడు.
జూన్ నుంచి ఈ సినిమా మీద డేట్స్ కేటాయించి వీలైనంత తొందరగా ఈ సినిమాను పూర్తి చేసి దసర బరిలో ఈ సినిమాను నిలపడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు ఉన్నప్పటికి పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలను పూర్తి చేసిన తర్వాత మిగతా సినిమాలకు కమిట్ అవుతాడా? లేదా అనే విషయం మీద ఒక క్లారిటీ అయితే రానుంది…
Also Read : విడుదలకు ముందే రజినీకాంత్ కూలీ రికార్డుల మోత.. ఓటీటీ రైట్స్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్!