Southwest Monsoon: రుతుపవనాల రాక ఈసారి ఆలస్యం అవుతోంది. ముందే కేరళను తాకినా రాష్ట్రంలోకి రావడానికి ఇంకా సమయం తీసుకుంటున్నాయి. దీంతో మరో నాలుగు రోజులు పొడి వాతావరణమే ఏర్పడనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మే 31నే కేరళను తాకినా 4 వరకు ఆంధ్రప్రదేశ్ లో విస్తరించాల్సి ఉన్నా కర్ణాటకలోనే ఆగిపోయాయి. దీంతో మరో నాలుగు రోజులు వేచి చూడక తప్పని పరిస్థితి. రుతుపవనాల రాకతోనైనా వాతావరణం చల్లబడుతుందని అనుకున్నా అవి త్వరగా కదలడం లేదు. ఫలితంగా ఆకాశంలో మబ్బులు కనిపించడం లేదు. ఎండల ప్రభావమే కనిపిస్తోంది.

ప్రస్తుతం బెంగుళూరు, ధర్మపురి ప్రాంతాల్లో రుతుపవనాల కదలికలు మొదలయ్యాయి. మరోవైపు విదర్బ, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీంతో రుతుపవనాలు కదలడం లేదని తెలుస్తోంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించడానికి మరో నాలుగు రోజులు పడుతుందని తెలుస్తోంది. రాబోయే రెండు రోజుల్లో రాయలసీమను తాకే వీలుంది. బుధవారం నంద్యాల, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలియజేసింది.
Also Read: Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 షురూ.. ప్రారంభం ఎప్పుడు? కంటెస్టెంట్స్ ఎవరంటే?
మృగశిర కార్తె వచ్చినా వాతావరణంలో మార్పులు కనిపించడం లేదు. దీంతో ఎండలు మండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అంతటా వేడి సెగలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరో నాలుగు రోజులు వాతావరణంలో మార్పులు ఉండవని అధికారులు చెబుతున్నారు. దీంతోనే రుతుపవనాలు వచ్చే వరకు ఎండలు ఇలాగే ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి ఈ సారి నైరుతి రుతుపవనాలు ఆలస్యంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తొలకరి ఆలస్యంతో వర్షాలు పడకపోవడంతో రైతులు ఏరువాక సాగడం లేదు. దీంతో పనులు కూడా ఆలస్యమవుతున్నాయి. వర్షాలు పడితే ఈ పాటికే దుక్కులు దున్ని విత్తనాలు విత్తుకునే సమయం. కానీ వానల జాడ కానరాకపోవడంతో రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. చినుకులు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూస్తున్నారు. తొలకరి వర్షాలు పడితేనే సాగుకు అనుకూలంగా ఉంటుంది. రైతులు తమ పొలాలను సిద్ధం చేసుకుని పనుల్లో మునిగిపోతారు.
Also Read: Niharika Konidela: భర్తను ట్యాగ్ చేస్తూ నేను సింగిలా? అని అడిగిన నిహారిక… ఇంతకీ ఏం జరిగిందంటే!