Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ .. తెలుగు నాట నంబర్ 1 రియాలిటీ షోగా ఇది కొనసాగుతోంది. సీజన్ 1 నుంచి నేటి సీజన్ 6 వరకూ ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. మధ్యలో ఈ ఏడాది ఓటీటీ వేదికగా వచ్చిన బిగ్ బాస్ నాన్ స్టాప్ సైతం విపరీతమైన ప్రేక్షకాదరణ పొందింది. ఇటీవలే ఈ షో ముగియగా బిందుమాధవి విజేతగా నిలిచింది. అది అలా ముగిసిందో లేదో ఇప్పుడు తాజాగా ‘బిగ్ బాస్ 6’ షో మొదలవబోతోంది. ఈ షో ప్రారంభానికి సంబంధించిన అప్ డేట్స్ ను నిర్వాహకులు తాజాగా ప్రోమో రూపంలో విడుదల చేశారు. అదిప్పుడు వైరల్ గా మారింది.

బిగ్ బాస్ 6కు సంబంధించిన సరికొత్త లోగో ప్రోమోను తాజాగా స్టార్ మా చానెల్ లాంచ్ చేసింది. ఇక కొత్త బిగ్ బాస్ హౌస్ ను కూడా చూపించింది. ఈ గ్రాండ్ లాంచ్ ప్రోమో రిలీజ్ చేసి ఆడియన్స్ లో మరింత ఆసక్తిని పెంచారు.
బిగ్ బాస్ మొదటి సీజన్ ను ఫూణేలో నిర్వహించారు. నాడు జూనియర్ ఎన్టీఆర్ తొలి సీజన్ హోస్ట్ గా చేసి సూపర్ హిట్ చేశాడు. ఆ సీజన్ 1 విజేతగా శివబాలాజీ నిలిచాడు. అనంతరం హైదరాబాద్ లోనే నిర్వహించిన సీజన్ 2కు నాని హోస్ట్ గా చేశాడు. బాగానే నిర్వహించినా వివాదాల్లో ఇరుక్కొని అభాసుపాలయ్యాడు. అనంతరం నాని వైదొలగగా.. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి నాగార్జున ఈ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సీజన్ 6కు కూడా నాగార్జునే హోస్ట్ చేయబోతున్నట్టు తాజాగా ప్రోమోలో ప్రకటించారు. ఇక వెయిటింగ్ అయిపోయిందని.. గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీకి అందరూ సిద్ధం కండి అంటూ ప్రోమోను ఆసక్తికరంగా వదిలారు.
బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తయ్యిందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఓ లిస్ట్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియా, యూట్యూబ్, టీవీ, సినీ సెలబ్రెటీలను బిగ్ బాస్ సీజన్ 6కు ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొన్న యాంకర్ శివ, ఆర్జే చైతు, మిత్రాశర్మలలో ఒకరు బిగ్ బాస్ 6లోనూ పాల్గొననున్నట్టు సమాచారం.
ఇక ప్రస్తుతం బిగ్ బాస్ 6కు సంబంధించి పాల్గొనే కంటెస్టెంట్ల జాబితా ఇదేనంటూ ప్రచారం సాగుతోంది. వారు ఎవరెవరో చూద్దాం..
-హీరోయిన్ ఆశా సైనీ
-జబర్ధస్త్ వర్ష,
-నటి సంజనా చౌదరి,
-సింగర్ మోహన భోగరాజు
-కమెడియన్ బిత్తిరి సత్తి
-యాంకర్లు మంజూష, రోషన్
-కొరియోగ్రాఫర్ పొప్పి మాస్టర్
-సీరియల్ నటి కరుణ భూషణ్,
-లక్ష్క్ చదలవాడ,
-సీరియల్ నటుడు కౌశిక్
-యాక్టర్ శ్రీహాన్
-నటుడు చైతన్య గరికపాటి
-యూట్యూబర్ కుషిత కల్లపు,
-బిగ్ బాస్ ప్రోమో
https://www.youtube.com/watch?v=HlAa0ImL1sg
[…] […]