Homeఆంధ్రప్రదేశ్‌TTD chairman controversy : డీప్ ఫేక్ వీడియో.. భారీ మూల్యం తప్పదా?!

TTD chairman controversy : డీప్ ఫేక్ వీడియో.. భారీ మూల్యం తప్పదా?!

TTD chairman controversy : ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టీటీడీ చైర్మన్ వ్యవహారం పెను దుమారానికి దారితీస్తోంది. బిఆర్ నాయుడు ఓ మహిళతో అభ్యంతరకర వీడియోలో కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ వీడియో పై విను వెంటనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించడం అనుమానాలకు తావిస్తోంది. డీప్ ఫేక్ వీడియోలు అంటూ సోషల్ మీడియాలో సైతం ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం టీటీడీ లడ్డు కల్తీ వ్యవహారం వివాదం నడుస్తున్న క్రమంలో ఈ వీడియో బయటకు రావడం చూస్తుంటే ఎక్కువమంది ఫేక్ అని అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై నిజనిర్ధారణ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించి ఉంటే బాగుండేది. తరచూ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా యాక్టివ్ మాట్లాడుతుంటారు. ఒకవైపు నెయ్యి కల్తీ వ్యవహారం నడుస్తోంది. మధ్యలో హెరిటేజ్ ను తెచ్చారు. అది అబద్ధమని కోర్టు తీర్పు ద్వారా తేలిపోయింది. ఇప్పుడు ఏకంగా టిటిడి చైర్మన్ వ్యవహారం బయటకు రావడం చూస్తుంటే.. పక్కా ప్లాన్ అని అర్థమవుతోంది.

* నిజమని తేలితే చెడ్డపేరు..
టిటిడి చైర్మన్ పై వచ్చిన ఈ వీడియో నిజమని తేలితే.. టీవీ5 అధినేతగా, సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తిగా బిఆర్ నాయుడుకు చెడ్డ పేరు రావడం ఖాయం. అయితే ఒకవేళ ఫేక్ వీడియో అయితే మాత్రం దానికి మూల్యం చెల్లించుకోవాల్సింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. సాధారణ నేతలపై ఇటువంటి ఆరోపణలు వస్తే సహజం అనుకోవచ్చు. పైగా బాధితురాలి తరఫున ఎటువంటి ఫిర్యాదులు రాకపోతే ఎవరూ పరిగణలోకి తీసుకొని కూడా. కానీ ఆరోపణలు వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పైన. నిజంగా అలా జరిగి ఉంటే మాత్రం అందుకు బిఆర్ నాయుడు మూల్యం చెల్లించుకోక తప్పదు. కానీ డీప్ ఫేక్ వీడియోలు అని తేలితే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు కూడా క్షమించరు.

* ఎటువంటి ఫిర్యాదు లేదు కదా?
ఒకవేళ ఈ వీడియో నిజం అని అనుకోవడానికి భావించాల్సిన పరిస్థితి వస్తే మాత్రం తప్పకుండా బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు చెబితేనే ఇది నిజమయ్యే అవకాశం ఉంది. పైగా డీప్ ఫేక్ వీడియోలు అని చిన్నపాటి ఆధారాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పైగా టీవీ5 అధినేత బి.ఆర్ నాయుడు టీటీడీ ట్రస్టు బోర్డు చైర్మన్ పదవి చేపట్టిన నాటి నుంచి రాజీనామా చేయాల్సిందేనన్న డిమాండు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తోంది. ఆయన కేవలం రాజకీయంగానే కాకుండా మీడియా పరంగా కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి. ఇలా వీడియోలు వచ్చాయో లేదో టీటీడీ మాజీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, పేర్ని నాని లాంటి వారు ముందుకు వచ్చి విమర్శలు చేశారు. ఒకవైపు డీప్ ఫేక్ వీడియో అని చిన్నపాటి ఆధారాలు దొరకడం.. దీనిపై దర్యాప్తు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులకు స్వయంగా డి ఆర్ నాయుడు ఫిర్యాదు చేశారు. అయితే ఈ పరిస్థితులు ఎలా ఉన్నా.. దీని వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఉందన్నది అందరిలోనూ ఒక అనుమానం. తప్పుడు వీడియో అని తేలిన మరుక్షణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను దిద్దుబాటు చేసుకోలేదు కూడా.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular