Homeఆంధ్రప్రదేశ్‌AP Secretariat: స‌చివాల‌యానికి వ‌స్తున్న అప్పులోళ్లు.. జ‌గ‌న్ స‌ర్కార్ ప‌రువు గాయ‌బ్‌..!

AP Secretariat: స‌చివాల‌యానికి వ‌స్తున్న అప్పులోళ్లు.. జ‌గ‌న్ స‌ర్కార్ ప‌రువు గాయ‌బ్‌..!

AP Secretariat: అప్పులున్న సంసారాన్ని లాగ‌డ‌మే చాలా క‌ష్టం. అలాంటిది రాష్ట్రాన్ని అభివృద్ధి దిశ‌గా న‌డ‌ప‌డం ఇంకా క‌ష్టం. ప్ర‌స్తుతం ఏపీ అప్పులు ఊబిలో కూరుకుపోయింది. పాత అప్పుల‌ను తీర్చ‌డ‌మేమో గానీ.. కొత్త అప్పులు చేయ‌కుండా ఉంటే చాలు అన్న‌ట్టు త‌యారైంది. ప‌రిస్థితి. అయితే అప్పులోల్లు ఏడాదికోసారి ఇంటికొచ్చి వ‌సూలు చేసుకుని పోతారు క‌దా. ఇప్పుడు జ‌గన్ ప్ర‌భుత్వానికి కూడా ఇలాంటి ప‌రిస్థితులే ఎదుర‌వుతున్నాయి.

AP Secretariat
AP Secretariat

ఎందుకంటే మార్చితో ఆర్థిక సంవ‌త్స‌రం పూర్త‌యిపోతుంది కాబ‌ట్టి.. అప్పులోల్లు వ‌చ్చి వ‌సూలు చేసుకోవాల‌నుకుంటున్నారంట‌. ఎందుకంటే టైమ్‌కు చెల్లింపులు చేయ‌ట్లేదు జ‌గ‌న్ ప్ర‌భుత్వం. గ‌తంలో తీసుకున్న రుణాల‌కు ఈఎమ్ ఐలు కూడా క‌ట్టట్లేదు వైసీసీ స‌ర్కార్‌. దీంతో కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు రేపో మాపో స‌చివాల‌యానికి రావ‌డాల‌ని డిసైడ్ అయ్యారంట‌.

కేంద్ర సంస్థ‌లైన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, హడ్కో లాంటి సంస్థల నుంచి రాష్ట్రానికి చెందిన ప‌లు కార్పొరేష‌న్ సంస్థ‌లు అప్పులు తీసుకున్నాయి. కానీ వాటిని వాయిదాల్లో చెల్లించ‌డం లేదు. దీంతో ఆయా కేంద్ర సంస్థ‌ల‌కు చెందిన ప్ర‌తినిధులు స‌చివాల‌యానికి రావ‌డానికి రెడీ అవుతున్నారు. స‌చివాల‌యానికి వ‌చ్చి అప్పులు వ‌సూలు చేసుకోవాల‌ని అనుకుంటున్నారు.

అదే జ‌రిగితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌రువు మొత్తం పోవ‌డం ఖాయం. ఎంత సేపు అప్పులు తెచ్చి సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డ‌మే త‌ప్ప‌.. వాటిని చెల్లించ‌డంలో మాత్రం శ్ర‌ద్ధ చూప‌ట్లేదు జ‌గ‌న్‌. మ‌రి ఎవ‌రైనా ఎంత కాలం ఊరుకుంటారు చెప్పండి.. అందుకే యాక్ష‌న్ షురూ చేస్తున్నారు. మోయ‌లేనన్ని అప్పులు చేస్తున్న జ‌గ‌న్ స‌ర్కార్‌.. వాటిని చెల్లించ‌గ‌లిగే ప్ర‌య‌త్నాలు మాత్రం చేయ‌ట్లేదు. ఎకాన‌మీ ప‌డిపోతే సంక్షోభ ప‌రిస్థితులు త‌ప్ప‌వ‌ని ఇప్ప‌టికే చాలామంది ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

AP Secretariat
Y S Jagan

ఏపీ అప్పుల ప‌రిస్థితిపై కేంద్రం కూడా ఇప్ప‌టికే ప‌లుమార్లు హెచ్చ‌రిస్తోంది. అప్పులు తీసుకోవ‌డంలో ఉన్న శ్ర‌ద్ధ‌.. వాటిని తిరిగి చెల్లించ‌డంలో ఎందుకు లేదంటూ కేంద్రం ప‌లుమార్లు పార్ల‌మెంట్ సాక్షిగా హెచ్చ‌రిస్తోంది. అయినా స‌రే నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు జ‌గ‌న్ సర్కార్ వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో అప్పుల ఊబిలోంచి ఇప్ప‌ట్లో బ‌య‌ట‌ప‌డే ప‌రిస్థితులు క‌నిపంచ‌ట్లేదు.

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version