Danger Bells To AP: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ నెలకొంది. రోజంతా ఎండ తీవ్రంగా ఉంటుంది. సాయంత్రానికి చలిగాలులు వీస్తున్నాయి. రాత్రికి చలి తీవ్రత పెరుగుతోంది. ఇటువంటి సమయంలో బంగాళాఖాతం నుండి కీలక హెచ్చరికలు వచ్చాయి. మరో రెండు అల్పపీడనాలు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. దేశం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయి. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో బంగాళాఖాతంలో అల్పపీడనాల ఏర్పాటుకు అనుకూలంగా వాతావరణ ఉంది. ఈ క్రమంలో దక్షిణ అండమాన్ కు సమీపంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. శ్రీలంక సమీపంలో మరో ఆవర్తనం సైతం ఏర్పాటు కానుంది. ఈ రెండు విపత్తులతో ఏపీతో పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన వచ్చింది వాతావరణ శాఖ నుంచి…
దక్షిణ కోస్తా వైపు తుఫాన్..
ఈనెల 19 నుంచి 20 మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడనుంది. అది దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్య తుఫాన్ గా బలపడి తీరం దాటనుంది. దీని ప్రభావం దక్షిణ కోస్తా పై ఉంటుందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఇంకోవైపు అంతకంటే మూడు నాలుగు రోజుల ముందు శ్రీలంకలో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రెండు తుఫాన్లుగా మారితే మాత్రం ఏపీ ప్రజలకు ఇబ్బందికరమే. ఇటీవల మొథా తుఫాను ఏపీ నీ వనికించింది. ఆ పరిణామాలను మరువక ముందే మరో రెండు విపత్తులు పొంచి ఉండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఒకటి రెండు రోజుల్లో వీటిపై క్లారిటీ రానుంది. ప్రస్తుతం ఖరీఫ్ నకు సంబంధించి వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటువంటి సమయంలో వర్షాలు పడితే మాత్రం ఇబ్బందికరమే.
వణికిస్తున్న చలి..
తెలుగు రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది. ముఖ్యంగా మన్య ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సైతం గణనీయంగా పడిపోయాయి. రాత్రి ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. సాధారణం కంటే మూడు నుంచి ఐదు శాతానికి పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత గననీయంగా పెరిగింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడటంతో చలి తీవ్రత ఉండదని అంతా భావించారు. కానీ గత రెండు రోజులుగా చలి విపరీతంగా ఉంది. అయితే మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.