Dammalapati Srinivas: ఏపీ రాజకీయాల్లో( AP politics ) ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది.. అయితే ఇప్పటివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అలజడి ఉంది. అయితే ఇప్పుడు అనూహ్యంగా మద్యం కుంభకోణం కేసులో రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఇవేవో ప్రత్యర్థి పార్టీలు చేసిన ఆరోపణలు కావు. తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ లో పనిచేసే వివి లక్ష్మీనారాయణ అనే సీనియర్ న్యాయవాది ఈ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ, న్యాయవర్గాల్లో కలకలం రేపాయి ఈ ఆరోపణలు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో అంతర్గత గందరగోళానికి దారితీస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలు చేసిన సీనియర్ న్యాయవాది వివి లక్ష్మీనారాయణ చిన్నపాటి ఆధారాలను చూపించలేకపోవడం విశేషం.
Also Read: సాయి రెడ్డిని పిలవాలా? వద్దా?.. కన్ఫ్యూజన్ లో జగన్!
అప్పటి ప్రయోజనానికి బదులుగా?
అయితే గతంలో వైసిపి ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనం దృష్ట్యా.. ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో వైసిపి పెద్దలకు దమ్మాలపాటి సహకరిస్తున్నారు అన్నది లక్ష్మీనారాయణ ఆరోపణ. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమరావతి లో ఇన్సైడ్ ట్రేడింగ్ కేసులు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. టిడిపి హయాంలో అమరావతి రాజధాని నిర్మాణానికి ముందే ఆ ప్రాంతంలో టిడిపి సన్నిహితులు భూములు కొనుగోలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. అలా భూములు కొనుగోలు చేసిన వారిలో దమ్మాలపాటి శ్రీనివాస్ ఉన్నట్లు వైసిపి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అయితే ఆ కేసును విత్ డ్రా చేసుకుంది జగన్ సర్కార్. అప్పట్లో అలా సహకరించినందుకుగాను ఇప్పుడు దమ్మాలపాటి వైసిపి పెద్దలకు సహకరిస్తున్నారన్నది లక్ష్మీనారాయణ ఆరోపణ.
Also Read: రాహుల్ గాంధీతో చేతులు కలిపిన జగన్?
చంద్రబాబుకు సన్నిహిత న్యాయవాది
దమ్మాలపాటి శ్రీనివాస్ టిడిపి అధినేత చంద్రబాబుకు( TDP chief Chandrababu ) సన్నిహితుడు. పేరున్న సీనియర్ న్యాయవాది. 2014 నుంచి 2019 మధ్య ఏజీగా పనిచేశారు. 2024లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏజీగా నియమితులయ్యారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని అనుమానించింది. హైకోర్టులో కేసు కూడా వేసింది. అయితే దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టులో సవాల్ చేసింది వైసిపి ప్రభుత్వం. అప్పట్లో ఇదే మాదిరిగా మరో కేసు తెరపైకి వచ్చింది. అయితే ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. దీంతో దమ్మాలపాటి కేసు కూడా నిలబడదని భావించి రాష్ట్ర ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంది. అయితే దానిని ఉదహరించి వివి లక్ష్మీనారాయణ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అయితే టిడిపి లీగల్ సెల్ విభాగంలో సేవలందించారు దమ్మాలపాటి. ప్రస్తుతం ఏజీగా నియమితులయ్యారు. కానీ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ కు సేవలందించిన చాలామంది న్యాయవాదులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకాలను కోరుకుంటున్నారు. అయితే వైసిపి హయాంలో నియమితులైన వారితో దమ్మాలపాటి కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు చేస్తున్నారు లక్ష్మీనారాయణ లాంటి న్యాయవాదులు. ఇప్పటికే దీనిపై చంద్రబాబుతో పాటు లోకేష్ కు ఫిర్యాదు చేశారు. అందులో భాగంగానే మద్యం కుంభకోణం కేసులో వైసీపీకి దమ్మాలపాటి సహకరిస్తున్నారని ఆరోపించారు. అందుకు తగ్గ ఆధారాలు మాత్రం చూపించడం లేదు. చెబుతున్న మాటలు కూడా సహేతుకంగా లేవు. అయితే ఇది టిడిపి అంతర్గత వ్యవహారంగా మారింది. అందుకే ఎవరూ పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.