YSR Congress: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీకి మరో షాక్ తప్పేలా లేదు. కూటమి వచ్చిన తర్వాత చాలామంది వైసిపి ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవులు కూడా రాజీనామా చేశారు. అయితే వారి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు శాసనమండలి చైర్మన్. ఎందుకంటే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కాబట్టి. ఎక్కడో స్థానిక నేతగా ఉన్న మోసిన్ రాజును తెచ్చి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ని చేయడమే కాదు.. ఏకంగా శాసనమండలి చైర్మన్ చేశారు. ఇప్పుడు ఆయన జగన్ పట్ల కృతజ్ఞత చాటుకుంటున్నారు. అందుకే మండలి చైర్మన్ ఫార్మేట్లో రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీలను ఆయన అస్సలు పట్టించుకోవడం లేదు. అనర్హత వేటు వేస్తే వారిపై చర్యలు ఉంటాయి కానీ.. అలా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలు కూటమి ఖాతాలో చేరుతాయి. అందుకే శాసనమండలి చైర్మన్ ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. అయితే ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అనివార్య పరిస్థితి ఎదురయింది.
ఆ ఎమ్మెల్సీ పై అలా..
2024 ఎన్నికల్లో విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రఘురాజు( MLC Raghuraj ) పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్నది ఒక ఆరోపణ. దీనిపై ఫలితాలు వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి విప్ పాలవలస విక్రాంత్ ఫిర్యాదు చేశారు. దీంతో మండలి చైర్మన్ ఆయనపై అనర్హత వేటును వేశారు. అయితే రఘురాజు గెలిచిన ఎమ్మెల్సీ సీటు స్థానిక సంస్థలకు చెందినది. విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్ష విజయం దక్కింది అప్పట్లో. అక్కడ ఎన్నిక వస్తే వైసిపి మరోసారి గెలిచే అవకాశం ఉండడంతో మండలి చైర్మన్ అనర్హత వేటు వేస్తారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే చివరి నిమిషంలో రఘురాజు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించింది. దీంతో ఆ ఎన్నిక నిలిచిపోయింది. ఎమ్మెల్సీ గా రఘురాజు కొనసాగారు.
వరుస ఎమ్మెల్సీలు గుడ్ బై
2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పోతుల సునీత, కర్రీ పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయ మంగళం వెంకటరమణ, జాకియా ఖానం, మర్రి రాజశేఖర్ లాంటి వారంతా రాజీనామా బాట పట్టారు. కానీ వీరి రాజీనామాలను ఆమోదించలేదు. అయితే వీరంతా ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన వారే. రాజీనామా ఆమోదిస్తే ఈ పదవులన్నీ కూటమి ఖాతాలో చేరుతాయి. అనర్హత వేటు వేసిన అదే పరిస్థితి. ప్రస్తుతం పోతుల సునీత, జాకీయా ఖానం బిజెపిలో చేరారు. జయ మంగళం వెంకటరమణ జనసేన లో చేరారు. మిగతా వారంతా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు. అయితే వీరంతా భౌతికంగా కూటమి పార్టీలో చేరిన.. శాసనమండలిలో మాత్రం వైసీపీ సభ్యులు గానే కొనసాగుతున్నారు. ఎందుకంటే వీరి రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు. అలాగని అనర్హత వేటు వేయలేదు. ఈ రెండు జరిగిన మరుక్షణం ఈ ఎమ్మెల్సీ సీట్లన్నీ కూటమి ఖాతాలో చేరడం ఖాయం.
కోర్టు నోటీసులు
అయితే తాజాగా జయ మంగళం వెంకటరమణ( jayamangalam Venkataramana ) కోర్టును ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం, సహితుకమైన కారణాలతో తాము రాజీనామాలు చేశామని.. కానీ మండలి చైర్మన్ అంగీకారం తెలపలేదని ఆ పిటిషన్ లో స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన కోర్టు 4 వారాల గడువు విధించింది. తప్పకుండా ఒక నిర్ణయానికి రావాలని నోటీసులు ఇచ్చింది మండలి చైర్మన్ కు. ఒకవేళ మండలి చైర్మన్ రాజీనామాలను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంటే మాత్రం మిగతా వారికి మోక్షం కలుగుతుంది. వారి రాజీనామాలు సైతం ఆమోదానికి నోచుకుంటాయి. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్. మరికొందరు ఎమ్మెల్సీలు సైతం రాజీనామా బాట పడతారు. ఎన్నికల్లో కూటమి గెలుస్తుంది. మండలి టిడిపి కూటమికి చిక్కుతుంది. మరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలా దీనికి అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.