Bandla Ganesh: సినీ, రాజకీయ రంగాల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు బండ్ల గణేష్( Bandla Ganesh). రాజకీయాల్లో ఎటువంటి పదవులు చేపట్టకపోయినా ఆయన చేసిన ప్రకటనలు అలా ఉండేవి. గత రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగాలనుకున్న బండ్ల గణేష్ కు ఛాన్స్ రాలేదు. అలాగని కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టలేదు. అయితే ఆయన మహా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. షాద్ నగర్ నుంచి తిరుపతికి మహా పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించారు. ఈనెల 19న తన పాదయాత్రను మొదలుపెట్టనున్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు కోసమే ఈ మహా పాదయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉంటూ టిడిపి సీఎం కోసం ఆయన పాదయాత్ర చేస్తుండడం నిజంగా హాట్ టాపిక్.
* చంద్రబాబు అరెస్టు సమయంలో..
పవన్ కళ్యాణ్ కు( Pawan Kalyan) వీరాభిమాని బండ్ల గణేష్. పవన్ అంటే విపరీతమైన అభిమానం ఆయనకు. పవన్ కళ్యాణ్ జనసేన ఉన్న ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. అయితే బండ్ల గణేష్ కు చంద్రబాబు విషయంలో కూడా విపరీతమైన అభిమానం. ఆ విషయం చంద్రబాబు అరెస్టు సమయంలో బయటపడింది. వైసిపి హయాంలో అక్రమాస్తుల కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 52 రోజులపాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. అదే సమయంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. హైదరాబాదులో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో బండ్ల గణేష్ పాల్గొన్నారు. ఏపీలో జరిగిన నిరసన కార్యక్రమాలకు సైతం హాజరయ్యారు. అయితే ఆ సమయంలో బండ్ల గణేష్ చేసిన ప్రకటనలు ప్రజల్లోకి బలంగా వెల్లాయి. అయితే చంద్రబాబు అరెస్టై ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తాను మహా పాదయాత్ర చేస్తానని బండ్ల గణేష్ మొక్కుకున్నట్లు తెలుస్తోంది..
* 19 నుంచి పాదయాత్ర..
ఈనెల 19న షాద్ నగర్( Shadnagar) నుంచి అమరావతికి మహా పాదయాత్రగా బయలుదేరుతారు బండ్ల గణేష్. ఆయనతోపాటు కొంతమంది అనుచరులు సైతం పాదయాత్ర చేస్తారని తెలుస్తోంది. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు అవుతుంది. అయితే ఇప్పుడు బండ్ల గణేష్ పాదయాత్రకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్డీఏ ముఖ్యమంత్రి కోసం ఇలా పాదయాత్ర చేస్తుండడం నిజంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.