https://oktelugu.com/

Posani Krishna Murali: నిన్న ఆర్జీవి.. నేడు పోసాని.. భలే ఇరుక్కుంటున్నారుగా

వైసిపి హయాంలో సినీ పరిశ్రమ నుంచి కొద్దిమంది మాత్రమే హవా చలాయించేవారు. అందులో రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణ మురళి ముందంజలో ఉండేవారు. వారిద్దరిపై ఇప్పుడు కేసులు నమోదు కావడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : November 12, 2024 11:37 am
    Posani Krishna Murali

    Posani Krishna Murali

    Follow us on

    Posani Krishna Murali: ఏపీ వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల అరెస్టు పర్వం కొనసాగుతోంది.వందలాది మందిపై కేసులు నమోదవుతున్నాయి.గత ఐదేళ్లుగా వైసీపీకి మద్దతుగా, ప్రత్యర్థి పార్టీల నేతలపై సోషల్ మీడియా వేదికగా చాలామంది విరుచుకుపడ్డారు.అందులో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఈ జాబితాలో రామ్ గోపాల్ వర్మ,పోసాని కృష్ణ మురళి, శ్రీ రెడ్డి వంటి వారు ఉన్నారు. 2019 ఎన్నికల్లో సినీ రంగం నుంచి చాలామంది వైసీపీకి మద్దతు తెలిపారు. అందులో పోసాని కృష్ణ మురళి ఒకరు.అందుకే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఎనలేని ప్రాధాన్యం దక్కింది.ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పోస్ట్ దక్కించుకున్నారు పోసాని కృష్ణ మురళి.అప్పటినుంచి మరింత రెచ్చిపోయేవారు.ముఖ్యంగా జగన్ ను ఎవరైనా విమర్శిస్తే తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు.చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. మెగాస్టార్ కుటుంబం పై తిట్ల దండకం అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అప్పట్లో అధికార పార్టీ కావడంతోఎటువంటి కేసులు నమోదు కాలేదు. ఇప్పుడు అదే కేసులు పోసాని కృష్ణ మురళిని వెంటాడుతున్నాయి.

    * అప్పట్లో ఫిర్యాదు చేసినా
    వైసిపి అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పై విపరీత వ్యాఖ్యలు చేసేవారు పోసాని కృష్ణమురళి.ఈ నేపథ్యంలో ఈ 2022లో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నేతలు.కానీ అప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.అరెస్టు చేసే ప్రయత్నం కూడా చేయలేదు.అయితే తాజాగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.అదే సమయంలో గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఫిర్యాదులను సైతం పోలీసులు తీసుకుంటున్నారు.ఈ క్రమంలోనే పోసాని కృష్ణమురళి పై మరోసారి ఫిర్యాదు చేశారు జనసైనికులు.ఏకంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మరింత బిగుసుకునే అవకాశం ఉంది.

    * ఫలితాలు వచ్చిన తర్వాత సైలెంట్
    కూటమి పార్టీల నేతల్లో పోసాని కృష్ణ మురళి పై ఆగ్రహం ఉంది.ముఖ్యంగా జనసేన పార్టీ శ్రేణులు ఓ రేంజ్ లో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేయాలని కోరుతున్నారు.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యారు.మధ్య మధ్యలో మీడియం ముందుకు వచ్చి విమర్శలు చేస్తున్నారు.కానీ గతం మాదిరిగా కాదు. ఇటీవల సాక్షి టీవీలో ఓ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.అయితే తాజాగా జనసేన నేతల ఫిర్యాదుతో పోసాని చుట్టు ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది.