Jaganannaku Chebudam : ఒకే ఒక్కడు స్టైల్.. ఒక్క కాల్ తో ప్రజల సమస్యలు తీర్చేస్తున్న జగన్

‘జగనన్నకు చెబుదాం’ మీ సమస్య పరిష్కారం.. మాకు ప్రాధాన్యతాంశం పేరిట ఏపీ సీఎం జగన్ ఒక గొప్ప కార్యక్రమాన్ని నేడు లాంఛనంగా ప్రారంభించాడు. ఏపీ ప్రజల కోసం 1902 అనే ట్రోల్ ఫీ నంబర్ ను లాంచ్ చేశారు.

Written By: NARESH, Updated On : May 9, 2023 9:25 am
Follow us on

Jaganannaku Chebudam : ఒక్క కాల్.. ఒకే ఒక్క కాల్.. డైరెక్టుగా సీఎంకు చేరుతుంది. అప్పట్లో ‘ఒకే ఒక్కడు ’ సినిమాలో హీరో అర్జున్ నేరుగా ఒక ఫోన్ నంబర్ ఇచ్చి ప్రజల సమస్యలు తీర్చేశాడు. అది సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు అచ్చం అలాగే జగన్ పూనుకుంటున్నాడు. ఒకే ఒక్క కాల్ తో ప్రజల సమస్యల తీర్చే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టాడు. నాడు వైఎస్ఆర్ ‘రచ్చబండ’ పెట్టి ప్రజలతో నేరుగా మాట్లాడి పరిష్కారం చేద్దామని అనుకున్నారు. కానీ అది ప్రారంభించేందుకు వెళుతూ కనుమరగయ్యారు. ఆ కార్యక్రమం ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఏ సీఎం చేపట్టలేదు. వైఎస్ఆర్ ‘రచ్చబండ’ పెట్టి నేరుగా ప్రజలతో మమేకం అవ్వాలని చూశారు. తిరుపతిలో మొదలుపెట్టడానికి బయలు దేరారు. వాతావరణం సరిగా లేకున్నా.. నాడు ప్రజల కోసం ఆయన సాహసం చేశారు. అయితే నల్లమల అడవుల్లో హెలిక్యాప్టర్ కూలిపోవడంతో వైఎస్ఆర్ ఆశయం నెరవేరలేదు..ఇప్పుడు ఏపీ ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధిగా ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు.నాన్న ఆశయాన్ని నెరవేరుస్తున్నారు. పారదర్శకంగా దీని సేవలు అందించేందుకు నడుం బిగించారు.

వైఎస్ఆర్ ఆశయాన్ని ఇప్పుడు జగన్ నెరవేరుస్తున్నాడు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు, వ్యక్తిగతంగా ఎదురయ్యే సమస్యలకు పరిష్కారమే ధ్యేయంగా జగన్ గొప్ప ముందడుగు వేశారు. నేతలు, ఎమ్మెల్యేలు, అధికారులతో సంబంధం లేకుండా నేరుగా తనకే సమస్యలు చెప్పేలా ఏపీలో ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు..

‘జగనన్నకు చెబుదాం’ మీ సమస్య పరిష్కారం.. మాకు ప్రాధాన్యతాంశం పేరిట ఏపీ సీఎం జగన్ ఒక గొప్ప కార్యక్రమాన్ని నేడు లాంఛనంగా ప్రారంభించాడు. ఏపీ ప్రజల కోసం 1902 అనే ట్రోల్ ఫీ నంబర్ ను లాంచ్ చేశారు. ఏపీలోని ప్రజలు ఎవరైనా పథకాలు, వ్యక్తిగత సమస్యలు, ప్రభుత్వ సేవలు ఏవైనా సరే ఇక నేరుగా జగనన్నకు చెప్పి సమస్యను పరిష్కరించుకునే గొప్ప కాల్ సెంటర్ ను జగన్ స్థాపించాడు..

ఈ కాల్ సెంటర్ కు సమస్య చెబితే వెంటనే వారికి సర్వీస్ రిక్వెస్ట్ ఐడీ కేటాయిస్తారు. ఎస్ఎంఎస్ ద్వారా ఆ సమస్య స్టేటస్ ను ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. అధికారులతో జగన్ నేరుగా సూచించి మరీ సమస్యను పరిష్కరిస్తారు. అంతా ఆన్ లైన్ లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలు వ్యయప్రయాసలకోర్చి ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. కేవలం ఇంట్లో నుంచే ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు మీ సమస్య పరిష్కారం అయిపోతుంది.. జగన్ తీసుకొచ్చిన ఈ అద్భుతమైన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది.