Homeఆంధ్రప్రదేశ్‌CM Revanth Reddy: హైడ్రా హైదరాబాద్ తో ఆగిపోదట.. ముందుంది ముసళ్ల పండుగ.. రేవంత్ ప్లాన్స్...

CM Revanth Reddy: హైడ్రా హైదరాబాద్ తో ఆగిపోదట.. ముందుంది ముసళ్ల పండుగ.. రేవంత్ ప్లాన్స్ ఇవే

CM Revanth Reddy: తెలంగానలో ఇప్పుడు ఏ జిల్లాలో చూసినా హైడ్రాపైనే చర్చ జరుగుతోంది. రెండు నెలల కాలంలోనే ప్రజల ఆదరణ పొందింది. హైదరాబాద్‌లో ఏళ్లుగా చెరబట్టిన చెరువులు, కుంటలు, నాలాలకు విముక్తి కల్పించడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తోంది. ఎఫ్‌టీఎల్, బఫర్‌ పరిధిలోని కట్టడాలను కుప్పకూలుస్తోంది. ధనిక, పేద, సంప్పన్నులు, ప్రముఖులు, రాజకీయ అనే తేడా లేకుండా ఆక్రమణదారులు ఎవరైనా.. నిర్మాణం అక్రమమైతే బుల్డోజర్లు దూసుకెళ్తున్నాయి. తాజాగా సీఎం సోదరుడి ఇంటికి కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది. దీంతో సామాన్యుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇక హైడ్రాను హైదరాబాద్‌కే పరిమితం చేయొద్దని, జిల్లాలకు తీసుకురావాలని చాలా జిల్లాల నుంచి డిమాండ్‌ పెరుగుతోంది. జిల్లాల్లోనూ చెరువులు, కుంటలు గడిచిన పదేళ్లుగా కనుమరుగయ్యాయి. దీంతో మాకూ హైడ్రా కావాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో హైడ్రా తరహా వ్వవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే చెరువుల ఆక్రమణలపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు.

జిల్లాల నుంచి డిమాండ్‌..
తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి హైడ్రా తరహా చర్యలు చేపట్టాలనే డిమాండ్స్‌ మేరకు త్వరలో హైడ్రా తరహా వ్యవస్థ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చెరువుల ఆక్రమణల మీద సీఎం రేవంత్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆక్రమణలకు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా ఖమ్మం, వరంగల్‌ మీద స్పెషల్‌ ఫోకస్‌ పెడతామనిస్పష్టం చేశారు. గడిచిన పది సంవత్సరాల్లో ఆక్రమణలు బాగా జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని రేవంత్‌ చెప్పారు. ఖమ్మంలో మాజీ మంత్రి భారీగా ఆక్రమణలకు పాల్పడ్డారని, కాలువలు ఆక్రమించుకున్నాడని స్థానికులు చెప్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ మేరకు వాస్తవాలను పరిశీలించి కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, రెవెన్యు మంత్రికి ఆదేశాలు జారీ చేశారు. కోర్టు నుంచి పర్మిషన్‌ తీసుకుని త్వరలోనే ఆ కూల్చివేతలు చేపడతామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌..
చెరువుల ఆక్రమణలపైన రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ చేపడతామని సీఎం తెలిపారు. చెరువుల ఆక్రమణలో ఎంతటి వారున్నా వదిలి పెట్టమని, చెరువుల ఆక్రమణకు సహకరించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. చెరువులు, నాలాల ఆక్రమణల జాబితా సిద్ధం చేయాలన్నారు. మాజీ మంత్రి ఆక్రమణ వల్లనే ఖమ్మంలో వరదలు వచ్చాయనే ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపారు. ఆక్రమణల తొలగింపునకు పక్కా ప్రణాళిక ఉందని, అమెరికాలో జల్సాలో మునిగి తేలుతున్న ఆయన ప్రభుత్వంపైన విమర్శలు చేస్తున్నడంటూ కేటీఆర్‌ పై మండిపడ్డారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version