Ramamurthy Naidu: ఏపీ సీఎం చంద్రబాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. చంద్రబాబుకు రామ్మూర్తి నాయుడు స్వయానా సోదరుడు. వీరిది చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లె.నారా ఖర్జూర నాయుడు, అమ్మనమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా అందులో పెద్దవారు చంద్రబాబు. చిన్న కుమారుడు రామ్మూర్తి నాయుడు.1978లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు చంద్రబాబు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.మంత్రి పదవి కూడా చేపట్టారు. అటు తరువాత అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ లోకి చేరారు. 1989 నుంచి ఎప్పటి వరకు ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు. రామ్మూర్తి నాయుడు తొలిసారిగా 1994లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.ఆ ఎన్నికల్లో గెలిచారు. 1999 నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. రామ్మూర్తి నాయుడు తిరుపతి కే పరిమితం కావడంతో టిడిపిలో ఎక్కువగా పాపులర్ కాలేకపోయారు.ఆయన మృతితో నారా కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సోదరుడు చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని హైదరాబాద్ బయలుదేరారు. మరోవైపు మంత్రి లోకేష్ సైతం హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు.
* అనారోగ్యంతో బాధపడుతూ
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు రామ్మూర్తి నాయుడు. హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత మూడు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తూ వచ్చింది.ఈ క్రమంలో కాసేపటి క్రితం చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు మృతి చెందారు.దీంతో నారా, నందమూరి కుటుంబాలు ఆస్పత్రి ప్రాంగణంలోకి చేరుకుంటున్నాయి. మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నారావారిపల్లికి కుటుంబ సభ్యులు తరలించనున్నారు. ఆదివారం రామ్మూర్తి నాయుడు స్వగ్రామం నారావారి పల్లెలో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.
* మొన్ననే కుమారుడి నిశ్చితార్థ వేడుకలు
నారా రామ్మూర్తి నాయుడుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.పెద్ద కుమారుడు నారా రోహిత్ సినీ హీరోగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. బాణం సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. సోలో సినిమాతో సక్సెస్ అందుకొని గుర్తింపు సాధించారు. కొద్ది రోజుల కిందట రోహిత్ వివాహ నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి. నటి సిరి లెల్లతో త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తండ్రి అనారోగ్యం కారణంగా పెద్దమ్మ భువనేశ్వరి, సోదరుడు లోకేష్ ఈ నిశ్చితార్థ వేడుకలను దగ్గరుండి జరిపించారు. అక్కడ కొద్ది రోజులకే రామ్మూర్తి నాయుడు అకాల మృతి చెందారు. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.