CM Chandrababu: ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో వయనాడ్ గా మారిపోయింది.. ముఖ్యంగా బుడమేరు ప్రవాహం వల్ల విజయవాడ నగరం నిండా నీట మునిగిపోయింది.. దీంతో ఆ ప్రాంతంలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది. ఇదే సమయంలో ప్రతిపక్ష వైసిపి కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోంది.. బుడమేరు ప్రవాహం వల్లే విజయవాడ నీట మునిగిందని.. చంద్రబాబు ఇల్లు మునిగిపోకుండా ఉండేందుకు బుడమేరు లాకులు ఎత్తారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వరద బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నాయకులు అంటున్నారు..
వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులకు సహాయం అందించడంలో విఫలమయామని ఒప్పుకున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తో చంద్రబాబు మాట్లాడుతున్న మాటలకు సంబంధించిన వీడియోను వైసిపి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో చంద్రబాబు నాయుడు నాదెండ్ల మనోహర్ తో మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో సహాయం అందించడంలో విఫలమయ్యామని.. ఇలా జరగకుండా చూసుకోవాలని సూచించారు.. దానికి నాదెండ్ల మనోహర్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా.. చంద్రబాబు ఒప్పుకోలేదు. దీనికి తోడు అక్కడ అధికారుల ముందు నాదెండ్ల మనోహర్ ను చంద్రబాబు మందలించారు. ఫలితంగా మనోహర్ ఒక్కసారిగా తన ముఖాన్ని చిన్న బుచ్చుకున్నారు. అధికారుల ముందు అలా అనడంతో ఆయన ఏదో వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. బాధితులకు సహాయం అందించే క్రమంలో మంత్రి నారాయణ కలగజేసుకున్నారని.. మధ్యలో మీరెందుకు వేలు పెడుతున్నారని అన్నారని.. నాదెండ్ల మనోహర్ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఆయన మాటలు పట్టించుకోకుండా చంద్రబాబు వైఫల్యాలను ఎత్తిచూపడం మొదలుపెట్టారు. దీంతో చేసేదేమీ లేక నాదెండ్ల మనోహర్ చంద్రబాబు చెప్తున్న మాటలను వినుకుంటూ వెళ్లారు. మరోవైపు పక్కన ఉన్న అధికారి కూరగాయల రవాణాకు సంబంధించిన విషయాలు చెబుతుంటే.. 25% మాత్రమే రవాణా చేశారు.. ఇంకా మిగతా పని ఎప్పుడు పూర్తి చేస్తారని చంద్రబాబు ఆయనను కూడా మందలించారు. నాదెండ్ల మనోహర్ తో మాట్లాడే కంటే ముందు చంద్రబాబు దారిలో వస్తుంటే.. ఒక వరద బాధితుడు అతడిని నిలదీశాడు. దీంతో అదే విషయాన్ని చంద్రబాబు నాదెండ్ల మనోహర్ తో ప్రస్తావించారు. వరద బాధితులకు సక్రమంగా సహాయం అందిస్తే ఇలాంటి ప్రతిఘటనలు ఎదురుకావు కదా అంటూ.. ఆయన పేర్కొన్నారు.
వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే..
చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ తో జరిపిన చర్చలకు సంబంధించిన వీడియోను వైసిపి తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..” వరద బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. కానీ వారి ఆస్థాన మీడియా మాత్రం గొప్పగా రాస్తోంది. చంద్రబాబు ఇల్లు నీట మునగగకుండా ఉండేందుకు బుడమేరు లాకులు ఎత్తింది నిజం. దానివల్ల విజయవాడ నీట మునిగింది నిజం. కానీ ఆ విషయాన్ని ఆస్థాన మీడియా దాచి పెట్టింది. పైగా ఇదే విషయాన్ని ప్రస్తావించిన ప్రతిపక్ష వైసిపి పై విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విజయవాడ ప్రజలు నరకం చూస్తున్నారు. నేడు విజయవాడ కాస్త విలయవాడ అయిందంటే దానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం. ఉప ముఖ్యమంత్రి ఇంతవరకు వరద బాధితులను పరామర్శించలేదు. చంద్రబాబు మాత్రం సెక్యూరిటీని తన వెంట వేసుకొని తిరుగుతూ ఉంటారు. అధికారులపై విమర్శలు చేస్తుంటారు. కానీ ప్రజల బాధలను మాత్రం పట్టించుకోరు. వరదలు వచ్చి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ విజయవాడ నగరం తేరుకోలేదు. ముంపు ప్రాంతాల ప్రజల కష్టాలు ఇంకా తీరలేదని” వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు..కాగా, నాదెండ్ల మనోహర్ ను చంద్రబాబు మందలిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వ్యాప్తిలో ఉంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Cm chandrababu shocking comments on nadendla manohar
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com