CM Chandrababu at Naravaripalli: ఏపీ వ్యాప్తంగా సంక్రాంతి సందడి నెలకొంది. అంతట ఒకటే ఆనందం. సీఎం చంద్రబాబు సంక్రాంతి పండుగను తన స్వగ్రామమైన నారావారిపల్లెలో జరుపుకోనున్నారు. సోమవారం రాత్రికి భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనువడు దేవాన్ష్ తో కలిసి స్వగ్రామానికి చేరుకున్నారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ, ఆయన చిన్నల్లుడు విశాఖ ఎంపీ శ్రీ భరత్, తేజస్విని తదితరులు నారావారిపల్లి వచ్చారు. మంగళవారం ఉదయం నుంచే అక్కడ సందడి నెలకొంది. పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.
మరోవైపు గ్రామంలో చిన్నారుల కోసం ప్రత్యేక పోటీలు నిర్వహించారు. వినోదాత్మక క్రీడలను ఏర్పాటు చేశారు. మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్ని బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, కాక్ ఫైట్, త్రీ లెగ్ రేస్, గ్లాస్ అండ్ బెలూన్ రన్ వంటి ఆటలు చిన్నారులను ఉత్సాహపరిచాయి. సీఎం చంద్రబాబు ఆసక్తితో వీక్షిస్తూ.. చిన్నారులతో కలిసి సంతోషంగా గడిపారు. అయితే చిన్నారుల క్రీడల్లో దేవాన్ష్ తో పాటు బాలకృష్ణ చిన్న మనవడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారులకు సీఎం చంద్రబాబు స్వయంగా బహుమతులు అందజేశారు. వారితో ఫోటో దిగుతూ ఆప్యాయంగా ముచ్చటించారు.
సీఎం చంద్రబాబు నారావారిపల్లెకు రావడంతో అంతటా సందడి వాతావరణం నెలకొంది. నారావారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. వారితో ఎంతో సందడిగా గడిపారు చంద్రబాబు. సీఎం రాకతో చాలామంది వినతులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. వారి నుంచి వినతులు స్వీకరించారు చంద్రబాబు. వారంతా రేపు భోగిమ భోగి వేడుకల్లో పాల్గొనున్నారు. సీఎం చంద్రబాబు తో పాటు ప్రముఖుల రాకతో నారావారి పల్లెలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.