CM Chandrababu: తుఫాన్లు వచ్చిన సమయంలో గుర్తొచ్చే పేరు చంద్రబాబు( CM Chandrababu). డిజాస్టర్ మేనేజ్మెంట్లో చంద్రబాబుకు మంచి పేరు ఉంది. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయన కార్యాలయంలో ఉండరు. క్షేత్రస్థాయిలో అడుగుపెట్టి పరిస్థితిని చక్కదిద్దుతారు. విజయవాడలో గత ఏడాది వరదల సమయంలో కూడా ఎంతో తెగువ చూపారు. ఇప్పుడు ఏపీ వైపు మొంథా తుఫాన్ దూసుకొస్తున్న క్రమంలో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయన పనితీరును చూసిన ఓ ఉన్నతాధికారి ఫిదా అయ్యారు. సీఎం సార్ ను చూసిన తర్వాత ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు అని చెప్పుకొచ్చారు. అలాగని ఆయన రాష్ట్రస్థాయి అధికారి కాదు. కేంద్రం పరిధిలో పనిచేసే అధికారి. సీఎం చంద్రబాబు పనితీరును చూసిన ఆయన తన మనసులో ఉన్న మాటను బయట పెట్టేశారు.
* హుద్ హుద్ సమయంలో సైతం..
గతంలో హుద్ హుద్( hudhud) తుఫాన్ వచ్చింది. విశాఖను తీవ్రంగా నష్టపరిచింది. ఆ సమయంలో కూడా ఈ కేంద్ర సర్వీసులో ఉన్న అధికారి ఏపీలో పని చేసేవారు. నిన్న తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రాత్రి వరకు సచివాలయంలో ఆర్టిజిఎస్ కేంద్రంలో సమీక్షించారు సీఎం చంద్రబాబు. సదరు ఉన్నతాధికారి ఉన్నారని.. గతంలో ఎన్నో విపత్తులను ఎదుర్కొన్నారని.. ఆయన ఇప్పుడు ఉన్నారు కానీ.. అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను సూచించారు. రాత్రి 11 గంటల సమయం దాకా తుఫానులపై సమీక్షించారు చంద్రబాబు. అలా ఆ ఉన్నతాధికారిని ఉద్దేశిస్తూ మాట్లాడారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారు. విశ్రాంతి తీసుకుని మళ్లీ వస్తానంటూ సీఎం చంద్రబాబు అక్కడకు వెళ్లిపోయారు.
* రాత్రంతా ఆర్టిజిఎస్ కేంద్రంలోనే..
అయితే ఆర్టీజియస్( RTGS ) కేంద్రంలో అధికారులతో పాటు జిల్లాల యంత్రాంగాలతో అనుసంధానం చేస్తూ రాత్రంతా సమీక్షలు జరిపారు చంద్రబాబు. అయితే చంద్రబాబు మళ్లీ ఆర్టిజిఎస్ కేంద్రానికి వస్తారని భావించిన సదరు అధికారి ఇంటికి వెళ్లలేదు. రాత్రంతా అక్కడే గడిపారు కానీ మీడియాకు సమాచారం అందించలేదు. చాలా గోప్యత పాటించారు. మంగళవారం ఉదయం ఆయనను మీడియా పలకరించింది. మీరు ఇంటికి వెళ్లలేదా అని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించేసరికి.. సీఎం సార్ ను చూశాక ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే చంద్రబాబు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఓ కీలక అధికారి ఇలా ఫిదా కావడం గమనార్హం.