CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) కొత్త ఇంటికి సంబంధించి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. అమరావతిలో చంద్రబాబు కొత్త ఇంటిని నిర్మించుకునేందుకు స్థలం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అదే స్థలంలో ఈరోజు భూమి పూజ చేశారు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు. వెలగపూడి లోని కొత్త ఇంటి కోసం కొనుగోలు చేసిన స్థలంలో బుధవారం ఉదయం 8:51 గంటలకు సీఎం చంద్రబాబు దంపతులు భూమి పూజ చేశారు. మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ తదితరులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ భూమి పూజ శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. సచివాలయం వెనుక ఇ6 రహదారి పక్కనే ఈ ఇంటి నిర్మాణం కొనసాగనుంది. ప్రస్తుతం చంద్రబాబు కృష్ణ నది కరకట్టల మీద తాత్కాలిక నివాసంలో ఉంటున్నారు. అమరావతిలో వీలైనంత త్వరగా ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించి గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు.
Also Read : వైఎస్ అడ్డాలో టిడిపి పండుగ.. ఏర్పాట్లు షురూ!
* వెలగపూడిలో సువిశాల స్థలంలో..
కొద్ది రోజుల కిందట వెలగపూడిలో( velagapudi ) సువిశాల విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేశారు సీఎం చంద్రబాబు. దాదాపు 1455 చదరపు గజాల విస్తీర్ణంలో.. జి ప్లస్ వన్ లో నిర్మించాలన్నది ప్లాన్. యాడాదిలోపు పనులు పూర్తి చేసి గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు. తాజాగా భూమి పూజ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా పనులు ప్రారంభించనున్నారు. గత ఏడాది డిసెంబర్లో వెలగపూడి కి చెందిన రైతు నుంచి 5 ఎకరాల నివాస స్థలాన్ని కొనుగోలు చేశారు సీఎం చంద్రబాబు. అప్పట్లో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి.. ఆ వెంటనే భూమిని చదును చేసే పనులు మొదలుపెట్టారు. ఇంటి నిర్మాణం లో భాగంగా గ్రౌండ్ ఫ్లోర్.. ఫస్ట్ ఫ్లోర్ కలిపి కడతారు. అయితే ఎక్కువ స్థలాన్ని గ్రీనరీ కోసం కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
* ఎస్ఆర్ఆర్ సంస్థకు నిర్మాణ బాధ్యతలు
ఈ ఇంటి నిర్మాణ బాధ్యతను ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్( SSR construction ) కంపెనీకి అప్పగించారు. ఏకంగా సీఎం చంద్రబాబు తమ గ్రామంలో ఇల్లు కట్టుకున్నందుకు వెలగపూడి గ్రామస్తులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు హైదరాబాద్ తో పాటు నారావారిపల్లెలో సొంత ఇళ్లు ఉన్నాయి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కూడా సొంత ఇల్లు లేదు. అక్కడ కూడా ఒక ఇల్లు నిర్మాణం చేపడుతున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు ఇంటికి సంబంధించిన వివాదం ఒకటి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అమరావతిలో సొంత ఇల్లు నిర్మించుకున్నారని.. కానీ చంద్రబాబుకు మాత్రం సొంత ఇల్లు లేదని.. కుప్పంలో కూడా ఇల్లు లేదని విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇటు అమరావతి తో పాటు అటు కుప్పంలో ఇళ్లను నిర్మించుకునే పనిలో పడ్డారు చంద్రబాబు.
* ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన..
అమరావతి రాజధాని( Amaravati capital ) పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ పనులు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు ఈ వారంలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళనున్నారు. ఇప్పటికే నిధుల సమీకరణ పూర్తయింది. నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా నడుస్తోంది. వేడుకగా అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతకముందే చంద్రబాబు తన ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయడం విశేషం.
Also Read : సొంత పార్టీ ఎమ్మెల్సీ పై టీడీపీ శ్రేణుల దాడి!