Brucellosis disease: భారతదేశ 70% కి పైగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. వ్యవసాయం చేసే రైతులు అదనపు ఆదాయం కోసం పాడి పరిశ్రమని కూడా ఎంచుకుంటారు. పాడి పరిశ్రమలో భాగంగా పశువుల పెంపకం ఎక్కువగా ఉంటుంది. అయితే పశువుల ను పెంచే క్రమంలో వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పశువులకు సోకే వ్యాధులను ఎప్పటికప్పుడు గుర్తించి సరైన చికిత్స అందించాలి. లేకుంటే ఒకదాని తర్వాత మరొక దానికి సోకే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు బ్రూసెల్లోసిస్. బృసెల్లా అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి పశువులకు సోకుతుంది. అంటువ్యాధి కావడంతో ఇది ఒకదాని నుంచి మరొకదానికి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి వివరాల్లోకి వెళితే..
బ్రృసెల్లోసిస్ వ్యాధి ఎక్కువగా గేదెలు, ఎద్దులు, మేకలు, గొర్రెలకు వస్తుంది. పశువులకు ఈ వ్యాధి సోకినప్పుడు అవి గర్భస్రావం, పాలు తగ్గడం, సంతాన ఉత్పత్తి సమస్యలను ఎదుర్కొంటాయి. ఇవి రైతులకు నష్టాన్ని కలిగిస్తాయి. ఈ వ్యాధి జూనోటిక్ అనే జంతువుల నుంచి మనుషులకు కూడా సోకే అవకాశం ఉంది. పశువుల నుంచి తీసుకున్న పాల ఉత్పత్తులను ఉడికించకుండా తీసుకోవడం లేదా ఈ వ్యాధి సోకిన పశువులను తాకడం వల్ల కూడా వ్యాధి సోకే ప్రమాదం ఉంది. దీనినే మాల్టా ఫీవర్, అండ్యు లెంట్ ఫీవర్ అని కూడా పిలుస్తారు.
పశువులకు ఈ వ్యాధి సోకే ముందు గుర్తించడం కష్టంగా ఉంటుంది. కానీ పశువులు అలసటగా ఉండడం.. కీళ్ల వాపులు కనిపిస్తే వెంటనే పశు వైద్యులను సంప్రదించాలి. ఈ వ్యాధికి పూర్తి చికిత్స లేదు. ఎందుకంటే బ్రెసెల్ల అనే బ్యాక్టీరియా పశువుల శరీరం లోపలే ఉంటుంది. కానీ వైరస్ వ్యాప్తి కాకుండా నియంత్రిత చర్యలు తీసుకోవచ్చును. పశువులకు బ్రూసెల్లోసిస్ వ్యాధి ఏర్పడినట్లు గుర్తిస్తే వాటిని వేరుగా ఉంచాలి. ప్రత్యేకంగా యాంటీబయాటిక్స్ టీకాలను రైతులు వేస్తుంటారు. పశు వైద్యాధికారి సలహాలతో టీకాలు వేయించాలి. ఈ వ్యాధి సోకిన జంతువుల పాలు తాగకుండా ఉండడమే మంచిది. ఒకవేళ తాగాల్సివస్తే బాగా మరిగించాలి. పశువుల చుట్టూ పరిశుభ్రత ఉంచుతూ.. విసర్జన పదార్థాలను జాగ్రత్తగా తొలగించాలి.
పశువులకు ఈ వ్యాధి సోకినప్పుడు S19 vaccine వేసే అవకాశం ఉంది. అయితే వ్యాధి తీవ్రతను బట్టి పశువైద్యాధికారుల నిర్ణయం మేరకే నడుచుకోవాలి. ఇక ఈ వ్యాధి మనుషులకు సోకే అవకాశం కూడా ఉండడంతో కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాధి సోకిన తర్వాత పశువులను ప్రత్యేకంగా వస్తూ వాటి దగ్గరికి కేవలం రైతులు మాత్రమే వెళ్లే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు వీటి దగ్గరికి రానీయకుండా చూడాలి. అయితే వైరస్ వ్యాప్తి లేదని.. వ్యాధి తీవ్రత తగ్గిందని తెలిస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఏ విషయమైనా వైద్య సలహాతో ముందుకు వెళ్లాలి.