Chittoor Monkey Incident: కోతి( monkey) చేష్టలు చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. అవి చేసే చేష్టలు చూడాలనిపిస్తాయి. పిల్లలయితే అమితంగా కోతులను ఇష్టపడతారు. కోతులు కనిపిస్తే కేరింతలు పెడతారు. అయితే ఒక్కసారి కోతులు కూడా ఇబ్బందికి గురిచేస్తుంటాయి. ప్రజా జీవనానికి ఆటంకం కలిగిస్తుంటాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో కోతి చేసిన పనికి 30 మంది ఆసుపత్రి పాలయ్యారు. గుడిపాల మండలం బసవపల్లెలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
Also Read: వీధి కుక్కల చేతిలో బలి.. వాకింగ్ కు వెళ్లిన ఓ బిలియనీర్ విషాద కథ
వేడుకలో అపశృతి
బసవ పల్లెలో( basavapalli ) ఆదివారం సుబ్రహ్మణ్యం అనే కుటుంబంలో ఇద్దరు పిల్లలకు స్థానికంగా కేశఖండన కార్యక్రమం నిర్వహించారు. వందలాదిమంది బంధుమిత్రులను పిలిచారు. అందరూ కలిసి సంతోషంగా కేశఖండన కోసం స్థానికంగా ఉన్న ఓ చెట్టు దగ్గరకు వెళ్లారు. దాదాపు ఓ 100 మంది వరకు అక్కడ ఉండగా.. కేశఖండన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఆ సమయంలో ఓ కోతి అటు ఇటు తిరుగుతూ హల్చల్ చేసింది. ఈ క్రమంలో చెట్టుపై ఉన్న తేనె తుట్టెను కదిలించింది. దీంతో తేనెటీగలు స్వైర విహారం చేశాయి. చెట్టు కింద ఉన్న వారి పై ప్రతాపం చూపాయి. ఓ 30 మందికి గాయాలయ్యాయి. 12 మందికి తీవ్ర గాయాలు కావడంతో గుడిపాల పీహెచ్సీకి తరలించారు. అక్కడ సిబ్బంది వైద్యం అందించడంతో కోరుకున్నారు. ముగ్గురు పరిస్థితి కొంచెం విషమంగా ఉండడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం లేనట్టు తెలుస్తోంది.
Also Read: పాము కరిచిన ఏం కాదు.. అంత పవర్ మొక్క ఇదీ.. వెంటనే తెచ్చేసుకోండి
పండ్లు తినేందుకు వచ్చి..
ఆ గ్రామంలో కోతుల సంచారం ఎక్కువగా ఉంది. సాధారణంగా ఏదైనా వేడుకల్లో పండ్లు, ఆహారం పెడుతుంటారు. ఈ క్రమంలో ఈ వేడుకల్లో సైతం పండ్లు పెడతారని భావించి కోతి అటువైపుగా వచ్చింది. అక్కడ వేడుక కోసం తెచ్చిన పండ్లను చూసి ఆ చెట్టుపై నక్కింది. ఈ క్రమంలోనే తేనె తుట్టను కదిలించింది. అయితే ఆనందంగా శుభకార్యం జరుపుకుంటామని భావించిన ఆ కుటుంబంలో కోతి రూపంలో అంతరాయం కలిగింది. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వేడుక కోసం వచ్చిన వారు ఇబ్బంది పడుతూ తిరుగు ప్రయాణం అయ్యారు.