Colocasia Root Benefits: ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవాలని కొంతమంది వైద్యులు చెబుతూ ఉంటారు. కానీ సరైన ఆహారం అనగానే చాలామంది మాంసాహారం వైపు వెళ్తూ ఉంటారు. మాంసాహారం తినడం వల్ల ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. కానీ అందరి శరీరాలకు ఇది వర్కౌట్ కాదు. కొందరు మాంసాహారం తినడం వల్ల బరువు పెరగడం.. కొవ్వు ఎక్కువగా పేరుకోవడం వంటివి ఉంటాయి. ఇలాంటి సమయంలో శాఖాహారంలోనూ కావాల్సిన ప్రోటీన్లు ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. వీటిలో చామదుంపల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇవి మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ వీటిని ఎవరూ పట్టించుకోరు. అయితే వీటి వల్ల ఉండే ప్రయోజనాల గురించి తెలిస్తే వెంటనే కొనేస్తారు. మరి వాటి గురించి తెలుసుకుందామా…?
నేటి కాలంలో ప్రతి పదార్థంలో షుగర్ కంటెంట్ ఉంటుంది. కొన్ని పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో షుగర్ పెరిగి డయాబెటిక్ వ్యాధిన పడుతున్నారు. ఇలా చక్కెర నిల్వలా స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు చామదుంపలను తినడం వల్ల ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తీసుకుంటే చక్కెర నిల్వలను సమాన స్థాయిలో వస్తాయి. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరంలో జీర్ణక్రియను పెంచుతాయి. వీటిని తీసుకున్న వెంటనే ఈ ఫలితం ఉండడం విశేషం.
కొన్ని రకాల పదార్థాలు తీసుకోవడం వల్ల కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. దీంతో గుండ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. గుండెకు మేలు చేసే పదార్థాల్లో చామదుంపలు ఒకటి. చామదుంపల వల్ల శరీరంలోకి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా వెళ్తాయి. అలాగే ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడంతో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్ సమస్య నుంచి కాపాడే అవకాశం ఉంది.
చామదుంపల్లో అనేక రకాల ప్రోటీన్లు ఉన్నాయి. వీటితో అదనపు శక్తి అంది అవకాశం ఉంది. ఇందులో B-6, E విటమిన్ లో ఉంటాయి. వీటితో గుండెజాబ్బులనుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే ఇందులో పొటాషియం కూడా ఉండడంతో ఎముకలు బలంగా మారే అవకాశం ఉంది. ఇక డియోస్కోరిన్ అనే ప్రోటీన్ ల వల్ల గుండె సమస్యలు రాకుండా కాపాడుతూ ఉంటుంది.
Also Read: ఈ రకం వాకింగ్ సాయంత్రం చేయండి.. అద్భుత ఫలితాలు
ప్రస్తుత కాలంలో చాలామంది బరువు సమస్యతో బాధపడుతున్నారు. దీని నుంచి బయటపడేందుకు చామదుంపలను తీసుకోవచ్చని అంటున్నారు. ఈ పదార్థంలో కేలరీల శక్తి తక్కువగా ఉంటాయి. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం చేకూరాదని అంటున్నారు. జీర్ణ సమస్య రాకుండా కూడా ఇవి కాపాడగలుగుతాయి.
రోగ నిరోధక శక్తి కోసం ఎన్నో రకాల పదార్థాలు అందుబాటులో ఉన్నా .. చామదుంపలు తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొందరి లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు చామదుంపలు తీసుకోవాలని వైద్యులే సూచిస్తున్నారు. అందువల్ల వారంలో ఒకసారైనా చామదుంపలు తీసుకోవాలని చెబుతున్నారు.