spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Chevireddy political news: చెవిరెడ్డి దూరమయ్యారా? దూరం చేశారా?

Chevireddy political news: చెవిరెడ్డి దూరమయ్యారా? దూరం చేశారా?

Chevireddy political news: వైఎస్ఆర్ కాంగ్రెస్ ( YSR Congress) పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ పంచాంగ శ్రవణం కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ ఏడాది జగన్ జాతకం బలహీనంగా ఉన్నా.. ఆయన భార్య భారతి రెడ్డి జాతకం మాత్రం బ్రహ్మాండంగా ఉందని పురోహితులు చెప్పుకొచ్చారు. అయితే ఏ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీ పంచాంగ శ్రవణాలు కొనసాగుతాయి అనేది బహిరంగ రహస్యమే. అయితే నిన్న వైసిపి కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఒక లోటు స్పష్టంగా కనిపించింది. పార్టీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనిపించకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేశారా? అనే చర్చ నడుస్తోంది.

హిందూ కార్యక్రమాల్లో..
వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల ఈ కార్యక్రమం జరిగినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(Chevy Reddy Bhaskar Reddy) కనిపించడం ఖాయం. ముఖ్యంగా సంక్రాంతితో పాటు ఇతర హిందువుల పండుగలు నిర్వహిస్తే దగ్గర ఉంటారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అలాంటిది ఆయన ఉగాది వేడుకల్లో కనిపించకపోవడంతో రకరకాల చర్చ నడుస్తోంది. అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు జగన్మోహన్ రెడ్డి దంపతులు. ఇతర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం అదే మాదిరిగా కనిపించారు.

ప్రముఖులంతా హాజరు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకలలో పాల్గొన్నారు. ముఖ్యంగా పేర్ని నాని, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కల్ప లతా రెడ్డి, రమేష్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్ వంటి నేతలంతా హాజరయ్యారు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం కనిపించకపోవడం ఇప్పుడు వైసీపీలోనే కొత్త చర్చకు దారి తీసింది. మొన్న మద్యన మద్యం కుంభకోణం కేసులో భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. చాలా రోజులపాటు రిమాండ్ లో ఉండిపోయారు. ఆయన లేకపోవడంతోనే ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు తాడేపల్లిలో నిర్వహించలేదన్న టాక్ ఉంది. అటువంటిది ఇప్పుడు ఉగాది వేడుకల్లో అదే చెవిరెడ్డి కనిపించకపోవడం వైసీపీలో భిన్నమైన చర్చ నడుస్తోంది. చెవిరెడ్డి దూరంగా జరిగారా? లేకుంటే జగన్మోహన్ రెడ్డి జరిపించారా? అనే దానిపై చర్చ సాగుతోంది. మరి ఏం జరిగిందో వారికే తెలియాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper