Homeఆంధ్రప్రదేశ్‌Overconfidence Hurt KCR And Jagan: పేరు మార్చి.. లోగో మార్చి.. సాధించింది ఏంటి..? మితిమీరిన...

Overconfidence Hurt KCR And Jagan: పేరు మార్చి.. లోగో మార్చి.. సాధించింది ఏంటి..? మితిమీరిన ఆత్మవిశ్వాసమే కేసీఆర్, జగన్‌కు దెబ్బేసిందా..!

Overconfidence Hurt KCR And Jagan: అధికారం ఎవరికి ఎప్పటికీ శాశ్వతం కాదు. కానీ.. అధికారంలో ఉన్నప్పుడు ఆ సూత్రాన్ని ఎవరూ పాటించరు. భవిష్యత్తులోనూ తమదే అధికారం అన్నట్లుగా రెచ్చిపోతుంటారు. నేను చేసిందే చట్టం.. నేను చెప్పిందే శాసనం.. నాదే ప్రభుత్వం.. అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. గత పదేళ్లు తెలంగాణ కేసీఆర్, గత ఐదేళ్లు ఏపీలో జగన్ ఇలానే రెచ్చిపోయారు. మళ్లీ తమదే అధికారం అని ఇష్టారీతిన పాలన సాగించారు. ఇప్పుడు వాటి ఫలితాలను అనుభవిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. గత ఎన్నికల సమయంలో ఈ ఇద్దరికి ఓటర్లు పెద్ద షాక్ ఇచ్చారు. ఇద్దరినీ అధికారం నుంచి దింపేశారు. ఏపీలో జగన్ కొమ్ములు విరిచారు. కేసీఆర్ నోరు నొక్కారు.

అయితే.. పదేళ్ల అధికారం ఎక్కడ చేజారిపోతుందేమో అన్న భయం కావచ్చు.. లేదంటే దశాబ్దం పాటు తెలంగాణలో ఆధిపత్యంతో వచ్చిన మితిమీరిన ఆత్మవిశ్వాసం కావచ్చు.. పార్టీ పుట్టుకకు, వచ్చిన పదవులకు భీజం వేసిన ప్రాంతీయ వాదానికి కేసీఆర్ చెక్ పెట్టారు. ప్రాంతాయ వాదాన్ని విడిచి పార్టీ పేరును మార్చారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన పార్టీ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. దాంతో ప్రజలు కూడా పార్టీని అక్కున చేర్చుకొని కేసీఆర్‌కు పదవులు అప్పగించారు. సెంటిమెంటును కాదని దేశ రాజకీయాల్లో సత్తా చాటాలని ఉబలాటపడ్డారు. చివరకు పార్టీకి బీఆర్ఎస్‌గా నామకరణం చేశారు. భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. దీంతో అప్పటి నుంచి పార్టీ మీద ప్రజల్లో సెంటిమెంటు పోయినంత పని అయింది. ఓ ఊపు ఊపిన పార్టీ కాస్త తానే బ్రేకులు వేసుకున్నారు.

ఇక.. కేసీఆర్ స్వకృపరాధం ఇలా ఉంటే.. జగన్ విధానం మరోలా కనిపిస్తోంది. ఐదేళ్ల అధికారం తలకెక్కడంతో.. ఇక ఆయనే శాశ్వత ముఖ్యమంత్రి అని అనుకున్నారు. తన పార్టీకి తానే రాజు అనుకున్న జగన్.. వైసీపీకి ప్రతిబింబంగా ఉండే సాక్షి లోగోను మార్చేశాడు. మొన్నటిదాక తన తండ్రి వైఎస్ బొమ్మతో నడిచే సాక్షి నుంచి వైఎస్సార్ బొమ్మను పూర్తిగా కనుమరుగు చేశారు. వైఎస్సార్ విగ్రహాలతో రాజకీయం మొదలు పెట్టిన జగన్.. అధికారం చేతికి వచ్చే వరకు తండ్రి లేని బిడ్డగా, చెల్లిని వెంటేసుకొని తిరిగాడు. అధికారం చేతికి రాగానే తల్లిని, చెల్లిని దూరం పెట్టాడు. ఇక వై నాట్ 175 నినాదంతో అందుకొని.. వైఎస్సార్ బొమ్మను తీసేశాడు. 30 ఏళ్లపాటు తనదే అధికారం అనుకున్న జగన్.. ఇక వైఎస్ బొమ్మతో పని ఏముందని అనుకున్నాడు. దాంతో వైఎస్ బొమ్మను తీసేశాడు. తండ్రి విగ్రహాలను అడ్డుపెట్టుకొని రాజకీయంగా ఎదిగిన జగన్.. ఆ తర్వాత వైఎస్ బొమ్మనే లేకుండా చేశాడు. దీంతో గతంలో 151 సీట్లు సాధించిన ఆయన, ఆయన పార్టీ 11 సీట్లకు పరిమితం కావాల్సివ చ్చింది. ఇక తెలంగాణ వాదంతో ఎదిగిన కేసీఆర్ తెలంగాణ అనే పదాన్నే పక్కన పెట్టారు. అటు జగన్ వైఎస్ బొమ్మను తొలగించారు. చివరికి ఈ ఇద్దరు సాధించింది ఏంటయా అంటే.. అధికారాలను కోల్పోవడమే అన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper