https://oktelugu.com/

CM Chandrababu : చంద్రబాబు పరపతి పెంచే పనిలో నితీష్.. కేంద్రానికి షాక్!

దేశంలో సీనియర్ మోస్ట్ లీడర్లలో నితీష్ కుమార్ ఒకరు. బీహార్ కు సుదీర్ఘకాలంగా సీఎంగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఎన్డీఏ కీలక భాగస్వామిగా ఉన్నారు. అయితే ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా అని ఆయన ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారు. దీంతో కేంద్ర పెద్దలు చంద్రబాబు వైపు ఆశగా చూడడం ప్రారంభించారు.

Written By:
  • Dharma
  • , Updated On : September 13, 2024 9:29 am
    CM Chandrababu

    CM Chandrababu

    Follow us on

    CM Chandrababu : కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. ఎన్డీఏ 3 లో చంద్రబాబు కీలకంగా మారారు. బిజెపి తర్వాత ఎక్కువ సీట్లు దక్కించుకున్న పార్టీగా టిడిపి ఉంది. ఆ పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. ఎన్డీఏ లో బిజెపి తర్వాత అతిపెద్ద పార్టీ కూడా టిడిపియే. అయితే ఐదేళ్ల వైసిపి పాలనలో చంద్రబాబు ఇబ్బంది పడ్డారు. ఎంపీల సంఖ్యాపరంగా వైసీపీకి ఎక్కువ బలం ఉండేది. టిడిపికి ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉండేవారు. జగన్ పార్టీకి 22 మంది ఎంపీలు ఉన్నప్పుడు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏకు ఏకపక్షంగా మెజారిటీ ఉండేది. దీంతో వైసిపి పార్లమెంట్ సభ్యుల బలం ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఇప్పుడు మాత్రం సీన్ మారింది. తెలుగుదేశం పార్టీకి లభించిన 16 ఎంపీ సీట్లు ఎన్డీఏ 3కు కీలకంగా మారాయి. అందుకే కేంద్ర పెద్దల వద్ద చంద్రబాబుకు ఎనలేని గౌరవం దక్కుతోంది. మరోవైపు నితీష్ చర్యల పుణ్యమా అని చంద్రబాబు నమ్మదగిన మిత్రుడిగా మారిపోయారు. ఇది అదునుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు పావులు కదపడం ప్రారంభించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలుసు. అందుకే వేసే ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారు.

    *మూడో అతిపెద్ద పార్టీ
    ఎన్డీఏలో నితీష్ నేతృత్వంలోని జెడియు మూడో అతిపెద్ద పార్టీ. ఆయనకు సైతం కేంద్రం ప్రాధాన్యమిస్తూ వచ్చింది. అయితే బీహార్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని నితీష్ కుమార్ మైండ్ గేమ్ ఆడుతున్నారు. మళ్లీ ఆర్జెడితో స్నేహంగా మెలుగుతున్నారు. బీహార్ లోని ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని పార్టీ ఢీకొట్టేందుకు ఆర్జెడి అవసరమని భావిస్తున్నారు. అందుకే తరచూ లాలు ప్రసాద్ యాదవ్, తేజస్వి తో స్నేహపూర్వకంగా ఉంటున్నారు. ఆయన తీరుతో బిజెపిలో రోజురోజుకు అనుమానాలు పెరుగుతున్నాయి.

    * పక్క చూపులు చూస్తున్న బిహారీ నేత
    అయితే నితీష్ పక్క చూపులు చూస్తుండడంతో ఇప్పుడు చంద్రబాబు పైనే కేంద్ర పెద్దలు ఆశలు పెట్టుకున్నారు. వాస్తవానికి చంద్రబాబును ఎన్నికల ముందు వరకు కేంద్ర పెద్దలు నమ్మలేదు. పొత్తు పెట్టుకునేందుకు కూడా ముందుకు రాలేదు. అయితే అనివార్య పరిస్థితుల్లో పొత్తు పెట్టుకున్నారు. అది సక్సెస్ అయింది. ఎన్డీఏ కు 21 ఎంపీ సీట్లు దక్కాయి. తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే 16 స్థానాలను సాధించింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చేందుకు దోహద పడింది. అదే సమయంలో నితీష్ నేతృత్వంలోని జీడియు 12 ఎంపీ సీట్లను సాధించింది. దీంతో చంద్రబాబుతో పాటు నితీష్ కు ఎనలేని ప్రాధాన్యం దక్కింది. కానీ గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు ఎక్కువ రోజులు ఎన్డీఏతో ట్రావెల్ చేయలేరని భావించారు. కానీ ఎక్కడా వివాదాలు పెట్టుకోకుండా చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎక్కువగా పరితపిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టారు.

    * తరచూ కూటముల మార్పు
    చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ సైతం సీనియర్. కానీ తరచు కూటమిలు మారుతారని ప్రచారం ఉంది. కానీ చంద్రబాబు విషయంలో అలా కాదు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు వైసీపీ ట్రాప్ లో పడ్డారు. ఎన్డీఏకు దూరమయ్యారు. వైసిపి ఎన్డిఏ కు దగ్గర అయినా ఆ కూటమిలో మాత్రం చేరలేదు. గత ఐదేళ్లుగా వైసిపి బిజెపికి దగ్గరగా ఉండేది. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టు పట్టలేదు. రాజకీయంగా ఇబ్బందులు రాకుండా చూసుకుంది. కానీ చంద్రబాబు ఎన్డీఏ లో కీలక భాగస్వామి అయ్యారు. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ పై ఒత్తిడి తెస్తున్నారు. ఇంకోవైపు నితీష్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. దీంతో కేంద్ర పెద్దలు చంద్రబాబుకు మరింత ప్రాధాన్యం ఇవ్వడం చేస్తున్నారు. మొత్తానికి అయితే నితీష్ చర్యల పుణ్యమా అని చంద్రబాబు పరపతి కేంద్రం వద్ద అమాంతం పెరుగుతోంది.