https://oktelugu.com/

Ravi Teja : విలన్ గా మారడానికి సిద్ధంగా ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో…కారణం ఏంటంటే..?

సినిమా ఇండస్ట్రీ అనేది ఒక వ్యసనం లాంటిది. ఇక ఇండస్ట్రీ కి రావడమే ఉంటుంది కానీ దీన్ని విడిచి వెళ్లిపోవడానికి ఏ ఒక్కరు ఇష్టపడరు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ లో తెలియని ఒక ఎమోషన్ అయితే దాగి ఉంటుంది. దాని వల్లే చాలామంది హీరోలు చాలా రోజుల పాటు కష్టపడి మరి స్టార్ హీరోలుగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : September 13, 2024 / 09:17 AM IST

    Raviteja

    Follow us on

    Ravi Teja :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి హార్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది నటులు మాత్రం వాళ్ళ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇక్కడ కొంతమందికి సక్సెస్ లు వస్తే, మరి కొంతమందికి మాత్రం ఫెయిల్యూర్స్ దక్కుతూ ఉంటాయి. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమా సక్సెస్ అయింది అంటే మాత్రం ఆ సినిమా దర్శకుడు సినిమాను చాలా బాగా తెరకెక్కించాల్సిన అవసరమైతే ఉంటుంది. అలాగే నటీనటులు కూడా వాళ్ళ పూర్తి ఎఫర్ట్ పెట్టి సినిమా ని విజయ తీరాలకు చేర్చాల్సిన అవసరమైతే ఉంది. మరి ఇలాంటి క్రమంలోనే కొంతమంది హీరోలు ఇప్పుడు చేస్తున్న సినిమాలేవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. ఇక దాంతో వాళ్లు సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గాని, విలన్ గా గాని మారాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి…

    ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ మాస్ మహారాజా గా వెలుగొందుతున్న రవితేజ కి కూడా ప్రస్తుతం వరుసగా ప్లాప్ లైతే వస్తున్నాయి. ఆయన కూడా మంచి క్యారెక్టర్ దొరికితే పెద్ద సినిమాల్లో విలన్ గా అయిన నటించడానికి సిద్ధంగా ఉన్నానని కొన్ని ఇంటర్వ్యూల్లో ఓపెన్ గా చెప్పిన విషయం మనకు తెలిసిందే. మరి ఇప్పటికే ఆయన వరుసగా నాలుగు సినిమాలతో భారీ డిజాస్టర్ లను మూటగట్టుకున్నాడు.

    కాబట్టి రాబోయే సినిమాలతో కనక ఆయన విజయాన్ని అందుకోకపోతే మాత్రం ఇక ఆయన తప్పకుండా విలన్ గా మారే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక సినిమాల్లో ఇప్పటికే కొంతమంది దర్శకులు అతన్ని విలన్ గా సంప్రదించినప్పటికీ విలన్ కరెక్టరైజేషన్ బాగాలేదనే ఉద్దేశ్యంతోనే రవితేజ ఆ పాత్రలను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ పెద్ద హీరో సినిమాలో విలన్ పాత్ర వస్తే మాత్రం రవితేజ తప్పకుండా చేస్తాడంటూ పలు వార్తలైతే వస్తున్నాయి. ఇక నిజానికి ఆయన మాస్ మహారాజు గా చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే.

    మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేయబోయే సినిమాలు కూడా సగటు ప్రేక్షకుడిని మెప్పిస్తూ వచ్చాయి. కానీ గత కొద్ది రోజుల నుంచి మాత్రం ఆయన ఎలాంటి మ్యాజిక్ ని చేయలేకపోతున్నాడు. తద్వారా ఆయన మార్కెట్ కూడా భారీగా పడిపోతుంది… ఇలాంటి సందర్భంలో ఇటు హీరోగా చేస్తూనే, అటు విలన్ గా సినిమాల్లో చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి రవితేజ ఇక మీదట తన కెరియర్ ని ఎలా బిల్డ్ చేసుకుంటాడు అనేది…