Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Warning To TDP MLAs: మారితే సరి.. ప్రత్యామ్నాయం సిద్ధం.. చంద్రబాబు హెచ్చరికలు

Chandrababu Warning To TDP MLAs: మారితే సరి.. ప్రత్యామ్నాయం సిద్ధం.. చంద్రబాబు హెచ్చరికలు

Chandrababu Warning To TDP MLAs: తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో చాలామంది ఎమ్మెల్యేల తీరుపై అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నారు. కానీ వారి పనితీరులో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. అందుకే పిలిచి మరీ మాట్లాడుతున్నారు. తాజాగా జిల్లాల వారీగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. నియోజకవర్గాల్లో ప్రధానమైన మూడు సమస్యలతో పాటు నిధుల పరమైన మరో మూడు సమస్యలను తెలుసుకొని వాటికి నిధులు మంజూరు చేసే పనిలో ఉన్నారు. పనిలో పనిగా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరును నేరుగానే హెచ్చరిస్తున్నారట చంద్రబాబు. ఇకపై మాట్లాడనని.. నేరుగా చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీచేస్తున్నారట. నిన్ననే శ్రీకాకుళం జిల్లా కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈరోజు విజయనగరం కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. నియోజకవర్గాల వారీగా అభివృద్ధితో పాటు ఆ ఎమ్మెల్యేల పనితీరును ముఖం మీద సీఎం చంద్రబాబు చెబుతున్నట్లు తెలుస్తోంది. పనిచేస్తే ఉంటారు.. లేకుంటే మాత్రం వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారు అంటూ హెచ్చరిస్తున్నట్లు సమాచారం.

Also Read: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు తప్పు.. వైసిపి చేసింది అంతకంటే తప్పు

* నియోజకవర్గాల వారీగా..
ఇటీవల కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. చాలామంది పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. అవినీతి ఆరోపణలు కూడా పెద్దగా ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళ నుంచి ఎమ్మెల్యేలను చంద్రబాబు( CM Chandrababu) హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ వారు పెడచెవిన పెడుతూనే ఉన్నారు. అందుకే ఎమ్మెల్యేల పనితీరు మొత్తాన్ని ఒక నివేదిక రూపంలో తెప్పించుకొని.. జిల్లాల వారీగా సమీక్షలు మొదలుపెట్టారట చంద్రబాబు. అయితే నేరుగా హెచ్చరిక కాదు వారి నుంచి వినతులు తీసుకోవాలని భావించారు. నిధుల సంబంధం లేని సమస్యలతో పాటు నిధులు అవసరమైన సమస్యలపై ఆరు విన్నతులు ఎమ్మెల్యేల నుంచి స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఆ నియోజకవర్గంలో సమస్యలకు పరిష్కార మార్గం చూపించినట్టు ఉంటుంది. ఆపై ఆ ఎమ్మెల్యే పనితీరుపై హెచ్చరిస్తున్నట్టు ఉంటుంది. నిన్ననే శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం జరిగింది. ఓ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చాలా రకాల ఫిర్యాదులు వస్తున్నాయని.. పనితీరు మార్చుకోకుంటే మార్చేస్తాను అంటూ హెచ్చరించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఆయన ఒక్కరినే కాదు ఇలా అన్ని జిల్లాల్లో వివాదాస్పద ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడమే అసలు ఉద్దేశం గా తెలుస్తోంది.

* గట్టి హెచ్చరికలు
కూటమి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతోంది. కానీ ఇంతవరకు చాలామంది ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపడడం లేదు. పైగా రకరకాల అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అయితే గెలిచిన మూడోరోజు సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు కూడా. ప్రజలు ఎంతో నమ్మకముతో గెలిపించారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం మనపై ఉందని గుర్తు చేశారు. అయితే ఆ తరువాత కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపరచుకోకపోగా.. అవినీతిని అలవాటు చేసుకున్నారు. అందుకే ఇప్పుడు జిల్లాల వారీగా రివ్యూలు జరుపుతూ గట్టి హెచ్చరికలు పంపుతున్నారు సీఎం చంద్రబాబు. అయితే ఇదే ఫైనల్ వార్నింగ్ అని.. ఇలా వివాదాలు, వివాదాస్పద అంశాలతో ముందుకెళ్తున్న ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయంగా నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version