Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.ఉచిత ఇసుక విధానంలో ఎదురవుతున్న విమర్శలకు చెక్ చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు ఉచితంగా ఇసుక అందించాలని ఆదేశాలు జారీచేశారు. వాగులు, వంకల్లో ఎవరైనా ఎక్కడైనా ఇసుక తవ్వి తరలించుకోవచ్చు అని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎటువంటి అడ్డంకులు సృష్టించవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి నాటికి పల్లె పండుగ పేరుతో చేపడుతున్న అభివృద్ధి పనులన్నీ పూర్తిచేయాలని ఆదేశించారు చంద్రబాబు.ఇసుక రవాణాను అడ్డుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఉచిత ఇసుక విధానం పై అనేక రకాల విమర్శలు వచ్చాయి. గతం కంటే మించి ఇసుక ఖరీదుగా మారిందని కామెంట్స్ వినిపించాయి. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇసుక విధానం పైనే ఎక్కువగా చర్చ జరిగింది. అందుకే సీఎం చంద్రబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇసుక విషయంలో పొరపాట్లు తలెత్తకుండా ఇంచార్జ్ మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యక్తిగత అవసరాల కోసం వాగులు, వంకల్లోఇసుకను ఉచితంగా తవ్వుకొని తీసుకెళ్లడానికి అనుమతించాలని స్పష్టం చేశారు.
* ఆదిలోనే ఆదేశాలు
ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ ప్రకటించిన సమయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఈ వ్యవహారంలో తల దూర్చవద్దని ఎమ్మెల్యేలతో పాటు నేతలకుస్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎక్కడికక్కడే మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమేయం ఎక్కువగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చాలా జిల్లాల్లో ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని.. వారి జోక్యం పెరిగిందని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఉచిత ఇసుక విధానం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చిందన్న ప్రచారం ప్రారంభమైంది. అందుకే ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకుంది. ఇసుక విధానంలో సీఎం సైతం కలుగజేసుకోవాల్సి వచ్చింది.
* మంత్రులకు హెచ్చరిక
తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉచిత ఇసుక అంశాన్ని సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నేరుగా మంత్రులకే గట్టి హెచ్చరికలు పంపారు. ఇసుక విషయంలో పొరపాట్లకు తావు లేకుండా ఇన్చార్జ్ మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యక్తిగత అవసరాలకు ఇసుకను అందించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎడ్ల బళ్ళు, ట్రాక్టర్లకు రవాణా చేసుకోవచ్చని.. వాటికి ఎవరు అడ్డు చెప్పకుండా ఆదేశాలు ఇవ్వాలని సీఎం మంత్రులకు సూచించారు. ఇసుక కోసం ఎవరికీ పైసా చెల్లించాల్సిన పని లేకుండా చేయాలన్నారు. అయితే పెద్ద నదుల విషయంలో మాత్రం నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు.
* ఆంక్షల సడలింపు
మరోవైపు ఇసుక రవాణా విషయంలో సైతం ఆంక్షలు సడలించారు. లారీలకు టన్నుల పరిమితి లేకుండా చేశారు. టిడిపి అనుకూల మీడియాలో సైతం ఉచిత ఇసుక విధానంపై పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ప్రభుత్వ వైఫల్యం బయటపడింది అన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో సీఎం చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు దిగారు. ఇసుక విషయంలో చాలావరకు సడలింపులు తొలగించారు. ప్రతి ఒక్కరి అవసరాలకు తగ్గట్టు ఇసుక అందేలా చర్యలు చేపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఇసుక విధానంలో తలదూర్చుతున్న పార్టీ ఎమ్మెల్యేలకు ఈనెల 18న క్లాస్ పీక నున్నట్లు తెలుస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Chandrababu warned the tdp leaders and mlas that action will be taken if they block the transportation of sand
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com