Chandrababu Viral Video: రాజకీయ నాయకులు ఎప్పుడూ ఏసీ యంత్రాలలో.. ఖరీదైన గదులలో ఉండకూడదు. మడత పడని చొక్కా.. ఫోల్డ్ నలగని ప్యాంట్ తోనే ఉండకూడదు. చెదరని జుట్టు.. పాలిష్ మాయని బూట్లతోనే దర్శనమివ్వకూడదు. అప్పుడప్పుడు జనాల్లోకి రావాలి. జనాలతో మాట్లాడాలి. జనాల కష్టాలు తెలుసుకోవాలి. అవసరమైతే జనాలతో ప్రయాణం చేయాలి. జనాలు తిండి తినాలి. అప్పుడే వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్..నివేదిక ఇస్తూనే ఉంటుంది. కాకపోతే అది ఎప్పటికీ కూడా సత్య దూరంగానే ఉంటుంది. అలాంటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి అంటే కచ్చితంగా నాయకులు ప్రజల బాట పట్టాలి. ప్రజలతో మమేకం అవ్వాలి. అన్నిటికంటే ముఖ్యంగా గ్రామీణ స్థాయి ప్రాంతాలలో పర్యటించాలి. అప్పుడే ప్రభుత్వ పనితీరు అర్థం అవుతుంది. లోపం ఎక్కడ ఉందో తెలుస్తుంది. దాని నివారణకు చేపట్టాల్సిన పరిష్కారం కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది.
Also Read: అది బొద్దింక కాదట.. వెంట్రుకట.. హోంమంత్రి అనిత వీడియో వైరల్..
బహుశా దీనిని గుర్తించారనుకుంటా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జనాలలో ఉంటున్నారు. జనాలతోనే తిరుగుతున్నారు. సమయం దొరికితే చాలు జనాలతో మమేకమవుతున్నారు. ఇటీవల క్వాంటం వ్యాలీకి సంబంధించి జరిగిన సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. అమరావతి భవిష్యత్తు లక్ష్యాన్ని ఆవిష్కరించారు. ఈ క్వాంటం వ్యాలీలో పెద్దపెద్ద కంపెనీలు పాల్గొన్నాయి. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇక కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉండడంతో అమరావతి నిర్మాణం వేగంగా సాగుతోంది. ఓవైపు కార్పొరేట్ వ్యక్తులతో మాట్లాడుతూనే.. మరోవైపు సామాన్య ప్రజలతో మమేకం అవుతున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగానే ఓ చర్మకారుడితో చంద్రబాబు మాట్లాడారు. అతడి సాధక బాధకాలు తెలుసుకున్నారు. అనంతరం అతడి డప్పు తీసుకొని కొట్టారు. తన కాన్వాయిలో అతడికి చోటిచ్చారు. తన పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడారు. రాజకీయాలు, పథకాలు అందుతున్నాయా.. అనే ప్రశ్నలు కాకుండా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి విషయాలు అడిగి తెలుసుకున్నారు.
Also Read: 12 నెలలు.. 12 ప్రాంతాలు.. 70 ఏళ్ల వయసులో ‘బాబు’ చేసిన పని వైరల్
చంద్రబాబు స్వయంగా తన దగ్గరికి రావడం.. తన డబ్బు తీసుకోవడం.. దానిని కొట్టడం.. పైగా తన కాన్వాయ్ లో చోటు ఇవ్వడంతో చర్మకారుడు పోషిబాబు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు.. అంతేకాదు చంద్రబాబు మాట్లాడుతున్నంత సేపు ఆనందం వ్యక్తం చేశాడు. తనతో మాట్లాడుతోంది ముఖ్యమంత్రి అని చూడకుండా.. ఏమాత్రం భయపడకుండా పోషిబాబు స్వేచ్ఛగా మాట్లాడాడు. చంద్రబాబు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాడు. చంద్రబాబు కాన్వాయ్ లో ప్రయాణిస్తున్నంతసేపు గర్వాన్ని ప్రదర్శించాడు. ఏపీ ముఖ్యమంత్రి తనతో ఉండడంతో కాసేపు ఉద్వేగానికి గురయ్యాడు.. చంద్రబాబు డప్పు కొట్టిన నేపథ్యంలో ఆ వీడియోను టిడిపి అనుకూల సోషల్ మీడియా విభాగం విపరీతంగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. చంద్రబాబు క్లాస్ మాత్రమే కాదని ఊర మాస్ అని ప్రచారం చేస్తోంది.. చంద్రబాబు ఏదైనా చేయగలరని.. ఏమైనా చేయగలరని వ్యాఖ్యానిస్తోంది. ఇక సహజంగానే వైసిపి అనుకూల సోషల్ మీడియా ఇలాంటి ప్రచారం ద్వారా చంద్రబాబుకు సొంత డప్పు కొట్టుకోవడం అలవాటని విమర్శిస్తోంది.
చర్మకారుడు పోశిబాబుతో డప్పు కొట్టిన సీఎం చంద్రబాబు నాయుడు pic.twitter.com/FTiLNY44yk
— Anitha Reddy (@Anithareddyatp) July 1, 2025