Chandrababu to Meet Union Ministers : ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) ఢిల్లీలో బిజీగా ఉన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తో పాటు కూటమి పార్టీల ఎంపీలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లారు. ఆయనతో పాటు డిన్నర్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మూడు రోజులపాటు ఢిల్లీలో బిజీగా ఉన్నాను సీఎం చంద్రబాబు. శుక్రవారం ఒక్కరోజే ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. శనివారం నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనున్నారు. అయితే వరుసగా కేంద్ర మంత్రులను చంద్రబాబు కలుస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ ప్రాజెక్టుల విషయంలోనే చంద్రబాబు పర్యటన సాగినట్లు సమాచారం.
* వరుసగా భేటీలు..
ఈరోజు ఉదయం ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద జోషిని( Prahlad Joshi) కలుసుకున్నారు చంద్రబాబు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఏపీకి సహకారం అందించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. అటు తరువాత 11 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. ఏపీలో వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్టులపై ఆయనతో చర్చించారు. బి ఈ ఎల్ డిఫెన్స్ కాంప్లెక్స్, హెచ్ ఏ ఎల్, ఏఎంసీఏ తదితర అంశాలపై చర్చించారు. మధ్యాహ్నం 12 గంటలకు జల్ శక్తి మంత్రి సి ఆర్ పాటిల్ తో సమావేశం అయ్యారు. కాగా మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కలవనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్వహించే సమీక్షకు హాజరవుతారు. నూతన నేర చట్టాల అమలుపై సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి ని కలవనున్నారు. శనివారం నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో పాల్గొంటారు ఏపీ సీఎం చంద్రబాబు.
Also Read: భారత్ ధర్మశాల కాదు.. శరణార్ధులపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
* అమిత్ షా తో డిన్నర్..
అయితే ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల ఢిల్లీ పర్యటన( Delhi tour) ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో కొనసాగుతున్న ప్రతిపాదిత ప్రాజెక్టుల సత్వర అమలుకు కేంద్రం మద్దతు కోరేందుకు ఆయన పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వరుసగా సీనియర్ కేంద్ర మంత్రులను కలవడం విశేషం. అయితే గురువారం అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు నేరుగా అమిత్ షా వద్దకు వెళ్లారు. అక్కడే డిన్నర్ చేశారు. కొద్దిరోజుల కిందట ఏపీ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు గంటలపాటు లోకేష్ కుటుంబంతో గడిపారు ప్రధాని మోదీ. ఇప్పుడు చంద్రబాబుతో కేంద్ర హోం మంత్రి కూడా విలువైన సమయాన్ని కేటాయిస్తూ గడపడం విశేషం. ఈ పరిణామాల క్రమంలో ఏపీలో ప్రతిపాదిత ప్రాజెక్టులకు కేంద్రం ఇతోదికంగా సాయం చేసే పరిస్థితి కనిపిస్తోంది.