Stree Shakti Scheme: ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) దూకుడు మీద ఉన్నారు. రెండు రోజుల కిందటే ఆయన సింగపూర్ పర్యటన ముగించుకొని ఏపీకి వచ్చారు. ఈరోజు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేశారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని వీరయపాలెంలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేశారు. పొలంలో రైతుల మధ్య ఈ పథకానికి ఆయన శ్రీకారం చుట్టడం విశేషం. మరోవైపు ఆ గ్రామ పర్యటనలో భాగంగా మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అయితే వేదిక అంటూ ఏర్పాటు చేయలేదు. కేవలం నులక మంచం పై కూర్చుని మహిళలతో ముచ్చటించారు చంద్రబాబు. వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. తాను మహిళా పక్షపాతినని.. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే కుటుంబాలు బాగుపడతాయని.. తద్వారా ఈ రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మరో పథకం గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు.
Also Read: గొప్ప పొలిటీషియనే కాదు.. నారా లోకేష్ ఓ మంచి ‘ఫ్యామిలీ మ్యాన్’ కూడా..
కీలక హామీ అమలు..
మహిళల ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చంద్రబాబు కొచ్చారు. ఆగస్టు 15 నుంచి మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో( RTC buses ) ప్రయాణం సాగించవచ్చని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో మహిళల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15 నుంచి ఆ పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దానికి స్త్రీ శక్తి అనే పేరు పెట్టింది. ఇదే విషయాన్ని ప్రకటించారు చంద్రబాబు. స్త్రీ శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Also Read: బల ప్రదర్శన.. చంద్రబాబు, జగన్ మధ్య తేడా అదే!
ఏర్పాట్లలో అధికారులు..
రాష్ట్రవ్యాప్తంగా స్త్రీ శక్తి ( Stree Shakti ) పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్త్రీ శక్తి పథకానికి సంబంధించి టికెట్లు కూడా రూపొందించారు. జీరో ఫెర్ టికెట్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. అందులో టికెట్ ధర చూపుతారు. కానీ దానిని రాయితీగా చూపిస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం అన్నది కూడా పొందుపరచనున్నారు. అయితే ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఉండనుంది. అయితే అధికారులు ఒకవైపు ప్రయత్నాల్లో ఉండగా అనేక రకాల ప్రచారం నడిచింది. వాటన్నింటినీ తెర దించుతూ చంద్రబాబు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15 నుంచి పథకం పక్కాగా అమలు చేస్తామని తేల్చి చెప్పారు. దీనిపై మహిళల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
CM Chandrababu‘s Key Announcement on Free Bus
“ఆగస్టు 15 నుండి మహిళలకు ఫ్రీ బస్… రాష్ట్రంలో ఎక్కడ నుండి ఎక్కడికైనా…”#ChandrababuNaidu pic.twitter.com/B4sFJjlYWK
— M9 NEWS (@M9News_) August 2, 2025