Chandrababu vs Jagan Leadership: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదా? ఎందుకు ఓడిపోయామో గుర్తించలేదా? ఇంకా పాత విధానాన్ని అనుసరిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ప్రత్యేకము. సెంటిమెంట్ అన్న నినాదం నుంచి పుట్టుకొచ్చింది ఆ పార్టీ. ప్రజా ఆకర్షణ మధ్య నిలబడింది ఆ పార్టీ. ఆ పార్టీ ఏం చేసినా బలప్రదర్శన ముఖ్యం. బల ప్రదర్శన లేకుండా చిన్నపాటి కార్యక్రమం కూడా ఆ పార్టీ చేసిన దాఖలాలు లేవు. అయితే అందుకు భిన్నంగా నడుచుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఎక్కడా బలప్రదర్శనకు దిగడం లేదు. ఎక్కడైనా ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఆ గ్రామస్తులతో మాత్రమే సరిపెడుతోంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అలా కాదు. జగన్ పరామర్శలకు వెళ్లినా బలప్రదర్శనే.. చివరకు చనిపోయిన నేతల కుటుంబాల పరామర్శలకు వెళ్లిన బల ప్రదర్శన వైపే మొగ్గు చూపుతోంది. దానినే తమ బలంగా చూపెడుతోంది.
Also Read: గొప్ప పొలిటీషియనే కాదు.. నారా లోకేష్ ఓ మంచి ‘ఫ్యామిలీ మ్యాన్’ కూడా..
రహదారులపైనే సమావేశాలు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) అధికారంలో ఉన్నప్పుడు సభలతో పాటు సమావేశాలు ఓ రేంజ్ లో ఉండేవి. బైక్ ర్యాలీలతో పాటు కార్యక్రమాల నిర్వహణ సైతం అదే మాదిరిగా ఉండేది. ఏకంగా ప్రధాన రహదారులను సభా వేదికలుగా మార్చిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు చేయాలంటే మైదానాల్లో చేస్తారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రహదారులపైనే చేసేది. అక్కడైతే బలంగా జనాలు గుమి గూడుతారని భావించేది. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా అన్నిచోట్ల ఇదే పరిస్థితి. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం తన సభల నిర్వహణకు సంబంధించి ప్రధాన రహదారులని ఎంచుకునేవారు. అక్కడైతే భారీగా జనాలు చేరుతారన్నది ఒక ప్లాన్. వైసిపి ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా.. ఏ జిల్లాలో పర్యటించినా.. ప్రజా రవాణాకు ఆటంకం కలిగేది. ఆ సభలకు జనాలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు వెళ్లేవి. చివరకు ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన బస్సులు సైతం మళ్ళించేవారు. దీంతో ప్రజా రవాణా స్తంభించేది.
Also Read: ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. ఎంపికైతే రూ.20 వేలు!
ఆ ఒక్క గ్రామానికి పరిమితం..
కూటమి ( Alliance) అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని పెంచి మూడు నెలల బకాయితో అందించింది చంద్రబాబు సర్కార్. అది మొదలు ప్రతినెల పింఛన్లు పంపిణీ చేసేందుకు చంద్రబాబు ఏదో ఒక జిల్లాకు వెళ్తున్నారు. మరోవైపు ఉచిత గ్యాస్ వంటి పథకాలు అమలు చేసే సమయంలో సైతం ఆయన జిల్లాలకు వెళ్లారు. అయితే ఈ పర్యటనలకు ఎక్కడ బల ప్రదర్శనకు అవకాశం లేకుండా చేశారు. ఎక్కడైనా ప్రభుత్వ కార్యక్రమ వేదిక నిర్వహిస్తే.. ఆ గ్రామస్తులతోనే చేపట్టేవారు. వారితోనే సరి పెట్టేవారు. ఈరోజు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రకాశం జిల్లా వీరయపాలెంలో శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. కానీ ఆ గ్రామానికి మాత్రమే పరిమితమయ్యారు. పొలంలో నులక మంచం పై కూర్చుని రైతులతో ముచ్చటించారు. వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఇప్పుడే కాదు.. ప్రతినెలా సీఎం చంద్రబాబు పర్యటన చాలా సింపుల్ గానే జరుగుతోంది. అస్సలు బలప్రదర్శనకు అవకాశం ఇవ్వడం లేదు. అయితే ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా వెళ్తోంది కూటమి ప్రభుత్వం. అయితే గతంలో సీఎం జిల్లాకు వచ్చారంటే బెంబేలు ఎత్తిపోయేవారు ప్రజలు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు తమ జిల్లాకు వచ్చారని ఎవరు భావించడం లేదు. అలా బల ప్రదర్శన లేకుండా తన పర్యటనలు ముగిస్తున్నారు చంద్రబాబు. అయితే తటస్థులతోపాటు విద్యాధికులు దీనిని ఆహ్వానిస్తున్నారు.