CM Jagan : జగన్ పై దాడి.. స్పందించిన చంద్రబాబు, చెల్లి షర్మిల, కేటీఆర్, కీలక నేతలు.. పవన్ సైలెన్స్

ఇక జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్ చేశారు. దీని మీద విచారణ జరపాలని బాబు డిమాండ్చేశారు. వ్యక్తులను కఠినంగా శిక్షించాలన్నారు. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం జగన్ పై దాడిని ట్విట్టర్ లోనూ కానీ.. ప్రకటన రూపంలో కానీ స్పందించకపోవడం గమనార్హం.

Written By: NARESH, Updated On : April 14, 2024 11:36 am

Chandrababu, Sharmila.. KTR.. key leaders who reacted to the stone attack on Jagan..

Follow us on

CM Jagan : ఏపీ సీఎం జగన్ పై దాడి సంచలనంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో బస్సు యాత్ర చేపడుతున్న జగన్ పై గులకరాయితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆయన ముఖంపై చిన్నపాటి గాయమైంది. ఎన్నికల ముంగిట దాడి జరగడంతో నేతలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. దాడిని ఖండించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వారి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

జగన్ తో కేటీఆర్ కు ప్రత్యేక బంధం ఉంది. మొన్నటి వరకు తెలంగాణలో కెసిఆర్ అధికారంలో ఉండేవారు. జగన్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగించేవారు. వీరిద్దరికీ ఉమ్మడి శత్రువుగా చంద్రబాబు ఉన్నారు. దీంతో వీరిమధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది. మొన్న ఎన్నికల్లో కెసిఆర్ ఓడిపోయారు. అయినా సరే జగన్ తో మంచి సంబంధాలే కొనసాగిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై దాడి జరగడంతో కేటీఆర్ అతిథిగా స్పందించారు.’ మీరు సురక్షితంగా ఉన్నందుకు సంతోషం. జాగ్రత్త జగన్ అన్న. దాడిని తీవ్రంగా ఖండిస్తున్న. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. దీనిపై ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న’ అంటూ ట్విట్ చేశారు. సరిగ్గా కోడి కత్తి దాడి సమయంలో సైతం కేటీఆర్ ఇదే మాదిరిగా స్పందించారు.

మరోవైపు షర్మిల భిన్నంగా స్పందించారు. దాడిని ఖండిస్తూనే.. ఉద్దేశపూర్వకంగా జరిపి ఉంటే నిందితులను కఠినంగా శిక్షించాలని కోరడం ఒక రకమైన అనుమానాలకు కారణమవుతోంది.’ ఎన్నికల ప్రచారంలో సీఎం పై దాడి దురదృష్టకరం. ఎడమ కంటి పైన గాయం కావడం బాధాకరం. ఇది ప్రమాదవశాత్తు జరిగిందనుకుంటున్నాం. అలాకాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అంటూ ట్విట్ చేశారు. ప్రమాదవశాత్తు అని సంబోధించడం ద్వారా షర్మిల కొత్త అనుమానాలను లేవనెత్తారు. ప్రస్తుతం ఈ ఇద్దరి నేతల ట్విట్లు వైరల్ అవుతున్నాయి.

-జగన్ పై దాడికి ప్రధాని మోడీ స్పందన
సీఎం జగన్ పై రాళ్ల దాడి ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ సహా ఇతర పార్టీల నేతలు స్పందించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు మోడీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పలువురు నేతలు ఖండించారు. రాజకీయాల్లో బేధాభిప్రాయాలుంటాయని.. అయితే హింసకు తావులేని.. ఒకరినొకరు గౌరవించుకోవాలని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

-చంద్రబాబు ఖండన.. నోరు మెదపని పవన్
ఇక జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్ చేశారు. దీని మీద విచారణ జరపాలని బాబు డిమాండ్చేశారు. వ్యక్తులను కఠినంగా శిక్షించాలన్నారు. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం జగన్ పై దాడిని ట్విట్టర్ లోనూ కానీ.. ప్రకటన రూపంలో కానీ స్పందించకపోవడం గమనార్హం.